ట్రంప్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

ట్రంప్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం
x
Highlights

కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. కశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ...

కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. కశ్మీర్ సమస్యలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ తనను కోరినట్టు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. కశ్మీర్ విషయంలో భారత దేశం తొలి నుంచి ఒకే మాటపై ఉందని ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ మరొకరి జోక్యం ఎలా కోరుతారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద శర్మ ప్రశ్నించారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా వ్యవహరించారంటూ ఆరోపించారు. దీనిపై ప్రధాని పార్లమెంట్‌లో స్వయంగా ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు. విపక్ష ఆరోపణలపై స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి జయ శంకర్ కశ్మీర్ వివాదంలో మూడో శక్తికి చోటు లేదన్నారు. ట్రంప్ జోక్యం కోరుతూ ప్రధాని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories