రాష్ట్రంలో పుంజుకున్న రిజిస్ట్రేషన్లు...

రాష్ట్రంలో పుంజుకున్న రిజిస్ట్రేషన్లు...
x
Highlights

లాక్ డౌన్ కారణం ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు అన్ని మళ్లీ పుంజుకుంటున్నయి. ఒక్క మే నెలలోనే సెలవు వున్న రోజులను తీసేస్తే మొత్తం 75,129 రిజిస్ట్రేషశన్లు...

లాక్ డౌన్ కారణం ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు అన్ని మళ్లీ పుంజుకుంటున్నయి. ఒక్క మే నెలలోనే సెలవు వున్న రోజులను తీసేస్తే మొత్తం 75,129 రిజిస్ట్రేషశన్లు జరిగాయి. అంటే సగటున రోజుకు 3 వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. దాని ద్వారా ప్రభుత్వానికి రూ.207.73 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో సగటున రోజుకు ఐదువేల నుంచి ఆరువేల వరకు రిజిస్ట్రేషన్లు అవ్వగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రోజుకు మూడువేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయినా ఈ విషయం ఆర్థికంగా ఊరటనిచ్చే అంశమని రిజిస్ట్రేషన్‌ శాఖవర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యలోనే ఏప్రిల్‌లో కేవలం 4,595 రిజిస్ట్రేషన్లు జరిగి రూ.12.74 కోట్ల ఆదాయమే వచ్చింది.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కవగా కోవిడ్-19 కేసులు నమోదవ్వడతో ప్రజలు బయటికి రాకుండా అప్రమత్తమవుతున్నారు. ఎక్కువగా ఆన్ లైన్ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌ చేసుకోవడం, పబ్లిక్‌ డాటా ఎంట్రీ (పీడీఈ) చేసుకోవడం పెరిగాయి. మే నెలలో

34,306 మంది ఆన్‌లైన్‌లో స్లాట్‌బుకింగ్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చారు. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారిలో ఒక్క మేలో 75 వేల స్లాట్ బుకింగ్ లు వున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా రిజిస్ట్రేషన్‌శాఖ సైతం ఆన్‌లైన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నది. రిజస్ట్రేషన్ కోసం వచ్చేవారికి ఇబ్బందులుంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 18005994788లో సంప్రదించాలన్నారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories