కొత్తజంటకు సర్ ప్రైజ్ గిఫ్ట్...చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

కొత్తజంటకు సర్ ప్రైజ్ గిఫ్ట్...చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
x
Highlights

స్నేహితుల పెళ్లి వేడుక అంటే చాలు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటుంటాం. కొంతమంది గోల్డ్ రింగ్స్ ఇస్తారు.

స్నేహితుల పెళ్లి వేడుక అంటే చాలు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటుంటాం. కొంతమంది గోల్డ్ రింగ్స్ ఇస్తారు.లేదా ఇంట్లో ఉపయోగపడే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇస్తారు. ఇంకా వెరైటీగా ఉండాలంటే చాక్లెట్ ను పేపర్ లో చుట్టి ఇస్తారు. ఇదే కోణంలో డిఫరెంట్ గిఫ్ట్ ఇవ్వాలనుకూన్నారు ఓ యువకుడి స్నేహితులు. అది ఏంటంటారా ప్రస్తుతం మార్కెట్లోకిలో 200 రూపాయలుగా ఉల్లిపాయల ధర పెరగడంతో వాటినే బహుమతిగా ఇచ్చారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.

కర్ణాటకలోని బాగల్‌కోటెలో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను ఓ గంపలో వేసి గిఫ్ట్ పాక్ చేశారు. ఆ ప్యాక్ ని దంపతులకు అందించి గిఫ్ట్ ని అక్కడే తెరవాలన్నారు. ఎంతో ఎగ్జైట్ మెంట్ తో స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్ ను తెరిచారు నూతన దంపతులు. స్నేహితులు గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చిన ఉల్లిపాయల బుట్టను చూసి ఒక్క సారిగా పెళ్లి మండపంలోని అందరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వేసారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఐతే పెరిగిన ఉల్లిగడ్డ ధరలపై సోషల్ మీడియాలో చాలానే వ్యంగాస్త్రాలు విసురుతున్నారు నెటిజన్లు.

ఇదిలా ఉంటే తాము ఉల్లిగడ్డలను అంతగా తినమని అందుకే వాటి ధరలను గురించి తెలియదని ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఓ సందర్భంగా చెప్పారు. దీంతో పెరంబలూర్‌ కాంగ్రెస్‌ నేతలు నిర్మలాసీతారామన్ కు ఉల్లిగడ్డలను పార్సిల్‌ చేశారు. ఉల్లిగడ్డలు తినని వారు మొదట వాటిని తినాలని, ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories