ఉల్లిపాయ vs టమోటా..నువ్వా నేనా..

ఉల్లిపాయ vs టమోటా..నువ్వా నేనా..
x
Highlights

అవి మనకు నిత్యావసరాలు వాటిలో ఏది లేక పోయినా వంటలో రుచి ఉండదు ముద్ద గొంతు దిగదు కానీ ఈ రెండిటికీ ఎప్పుడూ పడదు నువ్వా నేనా అనేలా పోటీ పడుతుంటాయి....

అవి మనకు నిత్యావసరాలు వాటిలో ఏది లేక పోయినా వంటలో రుచి ఉండదు ముద్ద గొంతు దిగదు కానీ ఈ రెండిటికీ ఎప్పుడూ పడదు నువ్వా నేనా అనేలా పోటీ పడుతుంటాయి. కొండఎక్కి కూర్చుంటాయి. సామాన్యుడికి ఒకసారి ఒకటి కన్నీరు తెపిస్తే మరొకటి పులుసు కారిస్తుంటుంది. బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్ధులపై పంచులు కురిపించినట్లు సామాన్యుడిపై ఒకసారి ఉల్లి, మరోసారి టమోటా ధరలు పెరిగి పంచుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజలను బాధ పెట్టడంలో ఈరెండూ ఎప్పుడూ నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నాయి.

ఉల్లి లొల్లి చేస్తోంది. కొందామంటే కొండెక్కి కూర్చుంది. రోజులు గడుస్తున్నా ధరలు దిగి రాకపోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకు ఉల్లి ధర అమాంతం పెరిగిపోతోంది. కర్నాటక, మహారాష్ట్రల్లో ఎక్కువగా ఉల్లి సాగు జరుగుతుంటుంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఉల్లి సాగుపై పెను ప్రభావం చూపింది. దీంతో దిగుబడులు ఘననియంగా తగ్గిపోయాయి దీంతో రేట్లు భారీగా పెరిగిపోయాయి.

నిన్న మొన్నటి వరకూ కిలో ఉల్లి 15 రూపాయలు ఉండగా ప్రస్తుతం ఉల్లి ధర హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో 35, రిటైల్‌లో 50 పలుకుతోంది. హైదరాబాద్ మార్కెట్‌కు మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఉల్లి భారీగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణలోని ఏ ఒక్క జిల్లాల్లోనూ ఉల్లి లేదు. మహారాష్ట్ర, కర్నాటకల నుంచి కూడా సప్లై ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన కర్నూలులోనూ ధరలు పెరుగుతున్నాయి.

రిటైల్ దుకాణాల్లో కిలో ఉల్లి 50 నుండి 60 రూపాయలు విక్రయిస్తున్నారు. గతం లో చిన్న నగరాలకి 80 నుండి 100 ట్రక్కులు ఉల్లి దిగుబడి అయ్యేవి అవి ఇప్పుడు 15 నుండి 20 ట్రక్కులకి పడిపోయింది దీంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ధరలు ఒక్కసారిగా పెరగడం సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు టమోటా ధర అమాంతం పడిపోయింది. నిన్నమొన్నటి వరకూ కిలో టమోటా 40 నుంచి 50 రూపాయల వరకూ ఉండేది ప్రస్తుతం 5 రూపాయలకే కిలో టమోటా దొరుకుతోంది. ధర పడిపోవడంతో వ్యాపారస్తులు టమోటా కొనుగోలుకు ముందుకు రావటం లేదు. మదనపల్లి మార్కెట్‌లో కిలో టమోటా 5 ధర ఉంది. ఇతర రాష్ట్రాల ట్రెడర్లు రాకపోవడంతో టమోటా ధరలు పతనమయ్యాయి. మొత్తానికి మొన్నటి వరకూ టమోటా ఇప్పుడు ఉల్లి ఈ రెండూ సామాన్యుడితో ఆడుకుంటున్నాయి. నువ్వు తగ్గితే నేను పెరుగుతానంటూ పోటీ పడుతున్నాయి నిన్న మొన్నటి వరకూ టమాటా పులుపు బరించిన ప్రజలు ఇప్పుడు ఉల్లి ఘాటును అనుభవిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories