ఉగ్ర ఘాతుకానికి 40 మంది సైనికులు బలైన రోజు ఈ రోజే

ఉగ్ర ఘాతుకానికి 40 మంది సైనికులు బలైన రోజు ఈ రోజే
x
Highlights

2019 ఫిబ్రవరి 14 దేశంలో ప్రేమికుల రోజు దినోత్వాన్ని చేసుకుంటున్న సమయంలో దేశంలో ఒక అలజడి రేగింది. సరిగ్గా ఇదే రోజున ఏడాది క్రితం ఎవరూ ఊహించని ఉగ్రదాడులు జరిగాయి.

2019 ఫిబ్రవరి 14 దేశంలో ప్రేమికుల రోజు దినోత్వాన్ని చేసుకుంటున్న సమయంలో దేశంలో ఒక అలజడి రేగింది. సరిగ్గా ఇదే రోజున ఏడాది క్రితం ఎవరూ ఊహించని ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో దేశాన్ని రక్షించే సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్ లో ఏర్పడి, ఉగ్రకార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది.

దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు. ఈ దాడిలో కొంత మంది తమ భర్తలను కోల్పోయాలు, తమ బిడ్డలను కోల్పోయారు, కొంత మంది పిల్లలు తమ తండ్రులను కోల్పోయారు. దీంతో ఈ రోజును బ్లాక్ డే గా చెప్పుకోవచ్చు. ఈ దాడిని ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే అమలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. జమ్మూ-శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. దీన్నే అదునుగా చేసుకున్న ఉగ్రవాదులు సరిగ్గా అదే సమయానికి దాడి చేసారు.

సీఆర్పీఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్, తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారని తెలిపారు. ఈ సంఘటన తరువాత భారత సైన్యం ఉగ్రవాదులకు బుద్ది చెప్పాలని చూసింది. దాని కోసం సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఎంచుకుంది. దీన్ని 2019 ఫిబ్రవరి 26వ తేదీన తెల్లవారుజామున అమలు చేసింది.

ఆ రోజున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసారు. ఈ ఎయిర్‌ స్ట్రయిక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో భారత సైనికుల ఆత్మకు శాంతి చేకూరింది. ఈ సంఘటన తరువాత వైమానిక దళం కెప్టెన్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్ సైనికులు చిక్కి ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఇక పోతే బాలాకోట్ సంఘటన తరువాత పాకిస్తాన్ భారత్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించాయి. ఇందులో భాగంగా భారత్ సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. కానీ భారత్ ఈ సారి కూడా వారిని సమర్ధంగా తిప్పికొట్టి విజయాన్ని సాధించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories