లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నిక
x
Highlights

17వ లోక్ సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే పక్షాల అభ్యర్థిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ బీజేపీ చేసిన...

17వ లోక్ సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే పక్షాల అభ్యర్థిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ బీజేపీ చేసిన తీర్మానానికి యూపీఏ పక్షాలతో పాటు తటస్థులుగా ఉన్న పలు పార్టీలు మద్ధతు ప్రకటించాయి. ఈ నేపధ్యంలో ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీవం అయింది. స్పీకర్ గా ఓం బిర్లా పేరును ప్రధాని మోడీ ప్రతిపాదించగా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ ఆయన పేరును బలపరిచారు. దీంతో అయన లోక్ సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాజస్ధాన్‌లోని కోటబూందీ నుంచి వరుసగా రెండు సార్లు ఓం బిర్లా గెలుపొందారు. 1987 నుంచి భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న ఓం బిర్లా 2003 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఓటమెరిగని నేతగా ఓం బిర్లాకు గుర్తింపు ఉంది. దీనికి తోడు సభా వ్యవహరాలపై పట్టు ఉండటం, పార్టీకి విధేయతగా ఉండటంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషిస్తున్నారు. రాజస్ధాన్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందిన నేతగా ఓం బిర్లా ప్రత్యేక గుర్తింపు పొందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories