15న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం.. టికెట్‌ ధరలివే..

15న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం.. టికెట్‌ ధరలివే..
x
Highlights

పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ను ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ-వారణాసిల...

పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ను ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఢిల్లీ-వారణాసిల మధ్య పరుగులు పెట్టే ఈట్రైన్‌ టికెట్‌ ధరలను ఖరారు చేశారు. క్యాటరింగ్‌ సేవలతో కూడిన టికెట్‌ ధరలని అధికారులు వెల్లడించారు. ఏసీ చైర్‌ కార్‌ టికెట్‌ ధర రూ 1850కాగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ చార్జ్‌ రూ 3,520గా నిర్ధారించారు. ఇవి తిరుగు ప్రయాణంలో చైర్‌ కార్‌ ధర రూ 1795 కాగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ 3470గా ఖరారు చేశారు. శతాబ్ధి రైళ్లతో పోలిస్తే చైర్‌ కార్‌ ధరలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండగా, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు 1.4 రెట్లు అధికమని అధికారులు వెల్లడించారు. కాగా ఈ రైలు మొత్తం 755 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 8 గంటల్లో ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తుంది. కేవలం కాన్పూర్, ప్రయాగరాజ్‌ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories