ఈయనో వెరైటీ టీచర్ : పాఠాలు డాన్స్ చేసుకుంటూ చెబుతాడు ...

ఈయనో వెరైటీ టీచర్ : పాఠాలు డాన్స్ చేసుకుంటూ చెబుతాడు ...
x
Highlights

ఒక విషయాన్నీ ఒకే రకంగా చెబితే మనకే బోరు కొడుతుంది . ఇక పిల్లల సంగతి సరేసరి .. చదువును ఎప్పుడు నాలుగు గోడల మద్యలో బయపడుతూ నేర్చుకోవద్దు. చదువుని...

ఒక విషయాన్నీ ఒకే రకంగా చెబితే మనకే బోరు కొడుతుంది . ఇక పిల్లల సంగతి సరేసరి .. చదువును ఎప్పుడు నాలుగు గోడల మద్యలో బయపడుతూ నేర్చుకోవద్దు. చదువుని ఇష్టంతో ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలన్నది అయన ఉద్దేశం .. అందుకే పిల్లలకి పాఠాలు పాటలు పాడుతూ ,డాన్స్ చేస్తూ చెబుతున్నాడు . రానురాను అయన పేరు కూడా డాన్స్ మాస్టర్ అయిపొయింది . ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వెరైటీ టీచర్ పేరు ప్రఫుల్లా కుమార్ పాతీ ఈయన ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాల్లో గల లంమ్తాపుట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇన్‌ఛార్జ్ హెడ్‌మాస్టర్ గా పని చేస్తున్నారు .

2008లో సర్వ శిక్ష్యా అభియాన్‌లో చేరినప్పటి నుండి ఈ విధంగా పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. దీనితో విద్యార్దులు ఆయనంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనిపైన ప్రఫుల్లా కుమార్ పాతీ మాట్లాడుతూ 'ఎప్పుడు ఒకే పద్ధతిలో విద్యార్దులకు భోదన చేయకూడదు . ఇలా భోదన మొదలు పెట్టినప్పటి నుండి విద్యార్దులు స్కూల్ కి వచ్చేందుకు బాగా ఇష్టపడుతున్నారు . ఇక మధ్యాహ్న భోజనం తిన్నా తర్వాత విద్యార్ధులకు నిద్ర వస్తుంది. ఇలా డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ పాఠాలు చెబితే విద్యార్దులు ఉత్సహంతో వింటారని' ఆయన చెబుతున్నారు . అయన విద్యార్దులకు భోదిస్తున్న పద్ధతిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories