సహజీవనం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు

సహజీవనం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు
x
Highlights

సహజీవన కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పు చెప్పింది. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత, పురుషుడిపై స్త్రీలు అత్యాచారం కేసులు పెడుతున్న తరుణంలో, ఓ మహిళ చేసే అంగీకార సహజీవనాన్ని అత్యాచారంగా భావించలేమని వ్యాఖ్యానించింది.

సహజీవన కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పు చెప్పింది. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత, పురుషుడిపై స్త్రీలు అత్యాచారం కేసులు పెడుతున్న తరుణంలో, ఓ మహిళ చేసే అంగీకార సహజీవనాన్ని అత్యాచారంగా భావించలేమని వ్యాఖ్యానించింది. ఓ పురుషుడితో ఆర్థిక అవసరాల కోసం లేదా శారీరక సుఖం కోసం సంబంధం ఏర్పరచుకుంటే అత్యాచారం కిందకు రాదని తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.

సేల్స్‌ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసిన ఓ మహిళ, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌ తో ఆరేళ్లపాటు సహజీవనం చేయగా, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఇప్పుడు నిరాకరిస్తున్నాడని సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. అతనిపై అత్యాచార ఆరోపణలతో కేసు పెట్టింది. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆరేళ్లు మోసం చేశాడని ఆమె ఆరోపించగా, ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరాబెనర్జీతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆరేళ్ల పాటు పెళ్లి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించింది. అంగీకార పూర్వకంగానే చేసే సహజీవనం అత్యాచారం కిందకు రాదని కోర్టు అభిప్రాయపడుతూ, కేసును కొట్టివేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories