Tamil Nadu: ఆలయంలో వింత ఆచారం: ప్రసాదంగా చికెన్, మటన్ బిర్యాని

Tamil Nadu: ఆలయంలో వింత ఆచారం: ప్రసాదంగా చికెన్, మటన్ బిర్యాని
x
Highlights

సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులకు గుడిలో తీర్థం పోసి ప్రసాదం ఇస్తారు.

సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులకు గుడిలో తీర్థం పోసి ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదంలో కూడా ఎన్నో వెరైటీలు ఇందులో ఇందులో ముఖ్యంగా పులిహోర, లడ్డూ, చెక్కర పొంగలి, గుడాలు, అటుకులు ఇలా ఎన్నో రకాల ప్రసాదాలు ఇవ్వడం చూసాం కానీ ఓ గుడిలో మాత్రం ఏకంగా 5స్టార్ హోటల్లో పెట్టినట్టుగా చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని ప్రసాదంగా ఇస్తున్నారు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఎక్కడ ఇంత వించ ఆచారాన్ని పాటిస్తున్నారో తెలుసుకోవాలనుందా.

పూర్తివివరాల్లోకెళ్తే తమిళనాడులోని మధురైలోని మనియాండి స్వామి గుడిలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆలయంలో దాదాపుగా 84 సంవత్సరాల నుంచి పాటిస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా రెండు రోజుల పాటు ఇలా చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని ప్రసాదాన్ని ఇవ్వడం ఆ గుడి ఆచారం అని చెబుతున్నారు. ప్రతి ఏటా జనవరి 24 నుంచి 26 వరకు ఆలయ వార్షికోత్సవాన్నినిర్వహిస్తారని, ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు బిర్యానిని ప్రసాదంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలిపారు.

ఇదే తరహాలో ఈ ఏడాది కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే 150 మేకలు, 300 కోళ్లతో బిర్యానిని తయారు చేసి ప్రసాదంగా ఇస్తున్నామని తెలిపారు. అంతే కాదు ఈ ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలో భుజించే సౌకర్యం కల్పించడమే కాకుండా భక్తులు ఇంటికి పార్సల్ ని తీసుకెళ్లే అవకాశాన్ని కూడా ఆలయ కమిటీ కల్పిస్తుంది. ఇక వారు అందించే ఆ బిర్యాని ప్రసాదం కోసం భక్తులు కూడా పెద్ద ఎత్తునే ఆలయానికి విచ్చేస్తున్నారని చెపుతున్నారు. అంతే కాదు ఆలయానికి విరాళాలు సైతం అందిస్తున్నారని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories