తెలుగు రాష్ట్రాల్లో కానరాని చినుకుజాడ

ముందస్తుగానే రుతుపవనాలు వస్తున్నాయన్నారు. అనుకున్నా సమయానికి వచ్చేస్తాయన్నారు. చెప్పిన సమయం రానే వచ్చేసింది....
ముందస్తుగానే రుతుపవనాలు వస్తున్నాయన్నారు. అనుకున్నా సమయానికి వచ్చేస్తాయన్నారు. చెప్పిన సమయం రానే వచ్చేసింది. కాని చినుకు జాడ లేదు. ఏటి లాగే ఆకాశం వైపు అన్నదాత ఆశగా చూస్తున్నాడు. వరుణుడి కరుణ కోసం ప్రార్ధిస్తున్నాడు. విత్తును మొలకగా మార్చి మొక్క అయ్యేంత వరకు కరుణించమంటూ కన్నీటితో వేడుకుంటున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు ఛాయలు వేగంగా అలుముకుంటున్నాయి. గతంతో పోల్చుకుంటే భారీగా వర్ష లోటు ఉంటంతో సాగుపై పెను ప్రభావం పడుతోంది.
అదిగో ఇదిగో అంటూ దోబూచులాడుతున్న వరుణుడి కోసం తెలుగు రాష్ట్రాల రైతులు ప్రార్దిస్తున్నారు. జూన్ తొలి వారంలోనే రావాల్సిన నైరుతి రుతుపవానలు ఇంత వరకు జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పుడమి తల్లి ఎప్పుడు పులికిస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ముఖం చాటేయడంతో రైతులమోహంలో ఆనందం కరువైంది. హలాలు పట్టి దుక్కులు దున్నిన రైతులు చినుకు తాకితే విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. కాని ఇంత వరకు వానలు కురవలేదు. ఏటా ఇదే సమయానికి కురిసే సగటు వర్షపాతంలో 46 శాతం మేర లోటు ఉండటంతో దిగాలు చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసినా విత్తనాలు వేసేందుకు 10 రోజుల పైనే పడుతుందంటున్నారు.
ఇక సమయానికి వర్షాలు వస్తాయని భావించి బోర్లు, బావులు, సాగునీటి ప్రాజెక్టుల పరివాహాక ప్రాంతాల్లో ముందస్తుగా విత్తనాలు వేసిన రైతులు నిండా మునిగామంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. వేలాది రూపాయలు నష్టపోయామంటూ ఆవేదన చెందుతున్నారు.
వాతావరణ శాఖ అధికారులు మాత్రం త్వరలోనే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకుతాయంటున్నారు. వాతావరణ మార్పులు, డ్రైస్పెల్స్ కారణంగానే నైరుతి రుతుపనాలు చురుగ్గా ముందుకు కదలలేకపోయాయని చెబుతున్నారు. ఇప్పటివరకు లోటు స్ధాయి వర్షపాతం నమోదైనా త్వరలోనే ఆశించిన స్ధాయి వర్షాలు కురుస్తాయంటున్నారు.
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
రిషి సునక్‌కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMTWeather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన
16 Aug 2022 1:55 AM GMTఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
16 Aug 2022 1:35 AM GMT