నిర్భయ కేసు: వినయ్‌ శర్మ పిటిషన్‌ కొట్టివేత

నిర్భయ కేసు: వినయ్‌ శర్మ పిటిషన్‌ కొట్టివేత
x
నిర్భయ కేసు: వినయ్‌ శర్మ పిటిషన్‌ కొట్టివేత
Highlights

నిర్భయ దోషి వినయ్ శర్మ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటీషన్‌ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ...

నిర్భయ దోషి వినయ్ శర్మ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటీషన్‌ని తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన మానసిక పరిస్థితి బాగా లేదని, తనకు మానవీయ కోణంలో క్షమాభిక్ష ప్రసాదించాల్సిన రాష్ట్రపతి తన అభ్యర్థనను తోసిపుచ్చడం సమంజసం కాదని వినయ్ శర్మ సుప్రీంకోర్టులో నాలుగు రోజుల క్రితం పిటీషన్ దాఖలు చేశాడు.

పిటిషన్ లో వినయ్ శర్మ పేర్కొన్న విధంగా అతను ఆనారోగ్యంతో లేడని ప్రస్తుతం అతని మానసిక స్థితి సరిగానే ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. వినయ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడని కోర్టు తెలిపింది. ఇక 2012లో నిర్భయ ఘటన జరగగా 2020లో (జనవరి 22, ఫిబ్రవరి 1) దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్‌ వారెంట్లు జారీ అయినప్పటికీ వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తు శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories