logo
జాతీయం

కాశ్మీరులో ఏర్పాటువాదులు చేస్తున్న పని చూస్తే..

కాశ్మీరులో ఏర్పాటువాదులు చేస్తున్న పని చూస్తే..
X
Highlights

కాశ్మీరులో ఏర్పాటువాద సంస్థ హుర్రియత్ చెందిన చీఫ్ మిర్వైజ్ ఉమర్ ఫరూక్, నదీమ్ జిలాని కుమారుడు నదీమ్ జిలానీలకు...

కాశ్మీరులో ఏర్పాటువాద సంస్థ హుర్రియత్ చెందిన చీఫ్ మిర్వైజ్ ఉమర్ ఫరూక్, నదీమ్ జిలాని కుమారుడు నదీమ్ జిలానీలకు జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ముందు హాజరు కావాలని నోటీసులు జారీచేసింది. సోమవారం వీరు దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఏర్పాటువాదం ముసుగులో టెర్రరిస్టులకు ఆయుధాలు, ఇతర సామాగ్రి సమకూరుస్తున్నారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. దీనిపై విచారిస్తున్నారు nia అధికారులు. ఈ క్రమంలోనే వారికి నోటీసులు జారీచేశారు.

బాలాకోట్ దాడి అనంతరం కాశ్మీరు లోయలో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో హుర్రియత్ సంస్థ ప్రతినిధుల నుంచి తీవ్రవాదులకు సంబంధించిన లెటర్ హెడ్స్ , అలాగే హై ఎండ్ కమ్యూనికేషన్ సిస్టం కలిగిన మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఉమర్ ఫరూక్ ఇంట్లో హైటెక్ ఇంటర్నెట్ సెటప్ , పాకిస్థాన్ కు వెళ్లాల్సిన వీసా దరఖాస్తులు, అలాగే పెద్ద మొత్తంలో నగదు, ల్యాప్ టాప్లు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నట్టు దర్యాప్తు సంస్థ తెలిపింది.

Next Story