నేషనల్ డాక్టర్స్ డే : వైద్యుడే దేవుడు..

నేషనల్ డాక్టర్స్ డే : వైద్యుడే దేవుడు..
x
Representational Image
Highlights

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఆపదకాలంలో వైద్యం చేసి మానవునికి పుర్జన్మనిచ్చేది వైద్యుడు.

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, ఆపదకాలంలో వైద్యం చేసి మానవునికి పుర్జన్మనిచ్చేది వైద్యుడు. ప్రస్తుత సమయంలో ప్రపంచంలో విజృంభిస్తున్న వైరస్ నుంచి ఎంతో మందికి వైద్యం చేసి, వారి ప్రాణాలను కపాడుతున్నారు. సమస్త ప్రాణకోటిని కాపాడే ఆ దేవుడు కూడా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తూ మానవాళిని అతలాకుతలం చేస్తున్న వైరస్ పారదోలకుండా గుడిలోనే ఉన్నాడు. కానీ ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి వారు అనారోగ్యం పాలవుతాం అని తెలిసినా కూడా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. వైద్య వృత్తిని అంకిత భావంతో నిర్వర్తిస్తూ సమాజానికి వారి వంతు సేవలను అందిస్తున్నారు. సంవత్సరానికి 365 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుడతారు వైద్యులు, అర్థరాత్రి తలుపుతట్టి అర్థిస్తే చీకటిని సైతం లెక్క చేయకుండా రోగి కోసం ఆలోచిస్తారు. అలాంటి దేవుళ్లకి చేతులెత్తి మొక్కుతూ హృదయపూర్వకంగా డాక్టర్స్ డే శుభాకాంక్షలను తెలుపుదాం..

జాతీయ వైద్యుల దినోత్సవం చరిత్ర ప్రతి సంవత్సరం మార్చి 30 న యునైటెడ్ స్టేట్స్లో జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. మొట్టమొదటి సారిగా డాక్టర్ డే ని మార్చి 30, 1933 జార్జియాలోని విండర్‌లో నిర్వహించారు. డాక్టర్ చార్లెస్ బి. ఆల్మాండ్ భార్య యుడోరా బ్రౌన్ ఆల్మాండ్ వైద్యులు చేసిన సేవలకు గుర్తింపుగా ఒక రోజు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. మొదటి సారిగా నిర్వహించిన డాక్టర్స్ డే రోజున గ్రీటింగ్ కార్డులతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వృత్తి కొనసాగిస్తూనే మరణించిన వైద్యుల సమాధులపై పువ్వులు ఉంచి వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేసారు.

ఇలా కొన్ని ఏండ్లు గడిచిన తరువాత మార్చి 30, 1958 న వైద్యుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మాణాన్ని ఆమోదించింది. 1990 లో, జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించడానికి సెనేట్‌లో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్ సెనేట్, ప్రతినిధుల సభలో చట్టం ఆమోదం పొందిన తరువాత, అక్టోబర్ 30, 1990 న, అధ్యక్షుడు జార్జ్ బుష్ S.J.రెస్. పబ్లిక్ లా 366 ప్రకారం ( ప్రస్తుతం ఈ లా 101-473 గా మార్చబడింది) మార్చి 30 ను "నేషనల్ డాక్టర్స్ డే"గా ప్రకటించారు. ఇక ఈ వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలో డాక్టర్ బి. సి. రాయ్ పుట్టినరోజు జ్ఞాపకార్థం జూలై 1 న భారతదేశంలో జరుపుకుంటారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories