మరో సంచలన నిర్ణయం దిశగా మోడీ అడుగులు.. వారిపై కొరడా ఝుళిపించే ఛాన్స్‌

మరో సంచలన నిర్ణయం దిశగా మోడీ అడుగులు.. వారిపై కొరడా ఝుళిపించే ఛాన్స్‌
x
Highlights

ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. అక్రమంగా బంగారం దాచే వారిపై కొరడా ఝుళిపించనున్నారు. లెక్క చెప్పని బంగారంపై సర్కార్ నిఘా ఉంచనుంది....

ప్రధాని మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. అక్రమంగా బంగారం దాచే వారిపై కొరడా ఝుళిపించనున్నారు. లెక్క చెప్పని బంగారంపై సర్కార్ నిఘా ఉంచనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా గోల్డ్ బోర్డు ఏర్పాటు దిశగా కేంద్రం అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.

ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ మరో అసాధారణ నిర్ణయం తీసుకోనున్నారు. అక్రమంగా బంగారం దాచే వారిపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచనుంది. నల్లధనాన్ని నిరోధించే లక్ష్యంతో పరిమితకాలంతో కూడిన ప్రత్యేక పథకం తీసుకురానుంది. ఒక వ్యక్తి లేదా కుటుంబం వద్ద బంగారం కలిగివుంటే పరిమితిని నిర్ణయిస్తారు. నిర్దేశించిన పరిమితికి మించి కలిగి ఉన్నవారికి భారీ జరిమానాలు విధిస్తారు. అయితే, వివాహిత మహిళలను ఈ పథకం నుంచి మినహాయించనున్నట్లు సమాచారం.

ఆదాయపు పన్నుమాఫీ పథకం మాదిరిగానే, ఈ బంగారంపై కూడా పన్ను మాఫీ పథకం ఒక నిర్దిష్ట కాలానికి అందుబాటులో ఉంటుంది. సరైన బిల్లులు లేకుండా బంగారంతో పట్టుబడిన వ్యక్తులు భారీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి వుంది. లెక్కల్లోకి బంగారాన్ని వెలికి తీసేందుకు ప్రత్యేకంగా ఒక గోల్డ్ బోర్డు పేరుతో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories