విక్రమ్‌ ల్యాండర్‌కు చలాన్‌ విధించం..సోషల్ మీడియాలో..

విక్రమ్‌ ల్యాండర్‌కు చలాన్‌ విధించం..సోషల్ మీడియాలో..
x
Highlights

చంద్రయాన్ -2 ప్రయోగంలో భాగంగా జాబిల్లి యాత్రకు బయల్దేరిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ ఎక్కడా డ్యామేజ్ కాలేదని, పరికరం...

చంద్రయాన్ -2 ప్రయోగంలో భాగంగా జాబిల్లి యాత్రకు బయల్దేరిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై హార్డ్ ల్యాండింగ్ అయినప్పటికీ ఎక్కడా డ్యామేజ్ కాలేదని, పరికరం మొత్తం సక్రమంగానే ఉందని ఇస్రో ప్రకటించింది. చంద్రునిపై తల్లకిందులుగా పడినా విక్రమ్ ల్యాండర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని కేవలం సిగ్నల్ కోసం ప్రయత్నిస్తున్నామని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తెలిపారు. విక్రమ్ నుంచి సిగ్నల్స్ వస్తాయన్న ఆశతోనే ఉన్నామని, దానికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామనీ అన్నారు. మరో వైపు విక్రమ్ ల్యాండింగ్ రేపిన ఉత్కంఠ ట్విట్టర్‌లో దుమ్ము రేపింది. ట్రాఫిక్ సిగ్నల్ పాటించని వారికి భారీ చలాన్లమోత మోగుతున్న తరుణంలో నాగపూర్ సిటీ పోలీసులు సరదగా చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది. డియర్ విక్రమ్ సిగ్నల్ బ్రేక్ చేసినందుకు చలాన్ పడదు.. కానీ ఎక్కడున్నావో .. కనీసం స్పందిస్తే చాలు.. దయచేసి స్పందించు అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తుండటంతో విక్రమ్ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నడుస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories