ఆ గుడిలో దేవుడు ఉంటాడు.. ఆ దేవుడిని సూర్యుడు ఉన్నప్పుడే దర్శించుకోవాలి

ఆ గుడిలో దేవుడు ఉంటాడు.. ఆ దేవుడిని సూర్యుడు ఉన్నప్పుడే దర్శించుకోవాలి
x
ఆ గుడిలో దేవుడు ఉంటాడు.. ఆ దేవుడిని సూర్యుడు ఉన్నప్పుడే దర్శించుకోవాలి
Highlights

ప్రపంచపటాన్ని ఒకసారి పరిశీలిస్తే అందులో మనకు తెలియని విషయాలు, పరిశోధించలేని అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే అంతుచిక్కని వింతలకు ప్రపంచం...

ప్రపంచపటాన్ని ఒకసారి పరిశీలిస్తే అందులో మనకు తెలియని విషయాలు, పరిశోధించలేని అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే అంతుచిక్కని వింతలకు ప్రపంచం పెటింది పేరు. కొన్ని వింతలను పరిశోధకులు చేధించినా మరికొన్ని రహస్యంగానే ఉండిపోతాయి. సరిగ్గా అలాంటి మిస్టరీ ఒకటి రాజస్థాన్‌లో ఉంది. ఇంతకీ ఏంటా రహస్యం.?

రాజస్థాన్‌ పింక్‌సిటీ. గులాబీ రాష్ట్రంలో ఒక గుట్టు దాగి ఉందన్న నిజం ప్రపంచానికి ఈ మధ్యే తెలిసింది. దేవాలయాల నగరిగా కూడా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లో ఒక రహస్యం దాగి ఉంది. బర్మెర జిల్లాలో మిస్టరీ టెంపుల్‌.

ఆ గుడిలో దేవుడు ఉంటాడు - విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు - ఆ దేవుడిని సూర్యుడు ఉన్నప్పుడే దర్శించుకోవాలి - సూర్యాస్తమయం అయ్యాక ఆ గుడికి వెళ్తే.... రాయిలా మారిపోతారు జాగ్రత్త.

ఇది కచ్చితంగా హెచ్చరిక కాదు. ముందు జాగ్రత్తగా ఉండమని చెప్పే సంకేతం. అవును ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారు మనం ఎవరినైనా ముట్టుకోగానే రాయిలా మారిపోతామనే విషయాలను చాలా సినిమాల్లోనే చూపించారు. అయితే ఈ దేవాలయంలోకి ఎవరైనా వెళ్తే రాళ్లుగా మారిపోతారట. వినడానికి వింతగా ఉన్న అక్కడ చాలామంది దీన్ని నమ్ముతారు. ఆ గుడికి వెళితే రాయిగా మారిపోతారని విశ్వసిస్తారు.

రాజస్థాన్‌లోని బర్మెర్ జిల్లాలో కిరడు అనే దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో రహస్యం ఏంటంటే ఈ గుడికి ఎవరైనా సూర్యాస్తమయం తరువాత ఎవరైనా వెళితే రాయిగా మారిపోతారట. అందుకని సూర్యాస్తమయం తరువాత ఈ గుడికి అక్కడ ఎవ్వరూ వెళ్లరు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వెళ్లినా తెల్లారే సరికి రాయిగా మారిపోతారని అక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అయితే అది నిజమా కాదా అనే విషయం సైన్స్‌కు కూడా అర్థం కావడం లేదు.

అక్కడి పురాణ కధల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక రుషి తన శిష్యులతో కలిసి ఈ దేవాలయానికి వచ్చారన్నది ప్రచారం. ఆ రుషి తన శిష్యలను దేవాలయం దగ్గర విడిచి దగ్గర ప్రాంతాలను చూడటానికి వెళ్లారట. అయితే గురువు గారు ఆ శిష్యులను విడిచిపెట్టి వెళ్ళడంతో అక్కడ తిండి లేక ఆ శిష్యుల ఆరోగ్యం క్షీణించిందట. ఆ దేవాలయం ప్రాంతంలో తిరుగుతున్న స్థానికులు ఎవ్వరూ శిష్యులకు సహాయం చేయలేదట. ఈ విషయం తెలుసుకున్న ఆ రుషి ఇంతటి కఠినమైన రాతి హృదయాలు కలిగిన స్థానికులను రాళ్లుగా మారమని శపించాడట.

అలా ఆ రుషి శాపానికి గురైన స్థానిక మహిళ విగ్రహం ఇప్పటికీ ఆ దేవాలయం సమీపంలో ఉందని స్థానికులు చెబుతారు. ఆ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్లినా లేక సూర్యాస్తమయం తరువాత ఆ దేవాలయంలో ఉన్నా రాయిగా మారిపోతారని నమ్ముతారు. అక్కడ చాలామంది ఈ విషయాలను నమ్ముతారు కూడా. అందుకే ఆ గుడి తలుపులు సాయంత్రానికే మూతబడతాయి. దీని గురించి తెలిసిన చాలామంది సూర్యాస్తమయం తరువాత ఆ గుడిలో ఉండటానికి భయపడిపోతున్నారు. పరిశోధకులు కూడా వెనుకంజ వేస్తున్నారు.

ఇటువంటి మిస్టరీలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అయితే ఆ మిస్టరీ రహస్యాలను చేధించడానికి పరిశోధకులు కుస్తీలు పడుతున్నారు. కొన్ని మిస్టరీలను చేధించినా ఇలాంటి మిస్టరీలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. సైంటిస్టులు త్వరలోనే దీన్ని చేధించాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories