కుండపోత వర్షాలతో వణికిపోతున్న ముంబై ..

కుండపోత వర్షాలతో వణికిపోతున్న ముంబై ..
x
Highlights

ప్రతీ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు రాగానే ముంబై వణికిపోతుంది. భారీ వర్షాలు ఆ నగరాన్ని ముంచెత్తుతాయి. ఈసారీ అదే జరిగింది. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి....

ప్రతీ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు రాగానే ముంబై వణికిపోతుంది. భారీ వర్షాలు ఆ నగరాన్ని ముంచెత్తుతాయి. ఈసారీ అదే జరిగింది. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సిటీలో చాలా చోట్ల వాన నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తాయి.

కుండపోత వర్షాలు కురుస్తుండటంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే సిటీలో చాలా చోట్ల వాన నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ నుంచీ తప్పించుకోవడం ముంబై ప్రజల వల్ల కావట్లేదు. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. జూన్‌ 29 వరకు ముంబయిలో ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

నగరంలోని ప్రధాన ప్రదేశాలతో పాటు శివారు ప్రాంతాలైన విహార్‌, జుహు, ములుంద్‌ల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. వాన అంటే ముంబై ప్రజలకు చాలా ఇష్టం. ఎందుకంటే అది అప్పటివరకూ ఉన్న తీవ్ర ఎండల్ని తరిమేస్తుంది. కానీ... అదే వాన ముంబై ప్రజలకు నరకం కూడా చూపిస్తుంది. అయితే, ఎక్కడికక్కడ వాన నీరు ప్రవాహంలా సాగుతోంది. ఏది రోడ్డో, ఏది కాలువో తెలియట్లేదు. ఎటు వెళ్దామన్నా నీరే కనిపిస్తోంది చాలా చోట్ల. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కింగ్స్ సర్కిల్, హింద్ మాటా..ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు పలు వీధులు వరదలతో పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు థానే రైల్వే స్టేషన్ లోని రైల్వే ట్రాక్ లు నీట మునిగాయి. మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్షం కారణంగా ముంబయి విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories