ఇద్దరు దొంగల అరెస్ట్.. 21,160 విలువ చేసే ఉల్లిపాయలు స్వాధీనం

ఇద్దరు దొంగల అరెస్ట్.. 21,160 విలువ చేసే ఉల్లిపాయలు స్వాధీనం
x
Highlights

కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లి పాయల ధరలు పెరిగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయి.

కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఉల్లి పాయల ధరలు పెరిగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోయాయి. మరో నెల రోజుల పాటు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇదిలా ఉంటే కొంత మంది ఈ ఉల్లి ధరలపై ఎక్కడ చూసినా సెటైర్లు, జోకులు, ఫన్నీ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది వారి ఇండ్లలో ఉల్లిపాయలు లేకుండా వంటలు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం దుకానాల్లో డబ్బులను వదిలేసి ఉల్లిపాయలను దొంగతనం చేసి దాచుకుంటుంటే, కొంత మంది వాటిని అధిక ధరలకు మార్కెట్ లో అమ్ముతున్నారు.

ఇదే తరహాలో ముంబయిలోనూ ఓ దొంగతనం జరిగింది. ముంబయిలోని డొంగ్రీ ఏరియాలో డిసెంబర్‌ 5వ తేదీ ఉదయం 4:30 గంటలకు ఇద్దరు వ్యక్తులు మార్కెట్ కు వచ్చారు. అక్కడ పక్కనే ఉన్న దుకాణానకు పరిశీలించి ఉల్లిపాయల దుకాణంలోకి చొరబడ్డారు. బస్తాల్లో నింపి ఉంచిన ఉల్లిపాయలను భుజాన ఎత్తకుని వెళ్లిపోయారు. తెల్లవారిన తరువాత ఆ దుకాణానికి వచ్చిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను గురువారం అరెస్టు చేశారు. అంతేకాక వారి నుంచి రూ. 21,160 విలువ చేసే ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories