ముంబైలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

ముంబైలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
x
Highlights

ముంబైలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. డోంగ్రీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం శిథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఇందులో...

ముంబైలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. డోంగ్రీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం శిథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఇందులో 12 మంది చనిపోయినట్టు సమాచారం. వర్షాల నేపథ్యంలోనే ఈ పాత నాలుగంతస్తుల భవనం కూలి ఉంటుందని భావిస్తున్నారు. కుప్పకూలిన భవనం వంద సంవత్సరాల పాతదిగా స్థానికులు చెబుతున్నారు. డోంగ్రీ ప్రాంతంలో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉంది. దీంతో అంబులెన్స్‌ల వరకు గాయపడిన వారిని తీసుకువెళ్లాల్సి వస్తోంది.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. స్థానిక ప్రజలు కూడా వారికి సహకరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ముంబైని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో BMC అధికారులు పాత భవనాలను ఖాళీ చేయాలని హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదు. ఇటువంటి సమయంలోనే ఈ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది.

రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సమాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఉదయం 11 గంటల 40 నిమిషాలకు పెద్ద శబ్ధంతో భవనం కూలినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నాలుగంతస్తుల భవనంలో సుమారు 7 కుటుంబాలు నివశిస్తున్నాయని అంటున్నారు. భవనం కూలిన సమయంలో 40 మందికి పైగా ఉన్నారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories