లోక్ సభలో ములాయం సంచలన వ్యాఖ్యలు.. నిర్ఘాంతపోయిన సోనియాగాంధి

బుధవారం 16వ లోక్ సభ ముగిసింది. దీంతో సభలో పలువురు పార్టీల నేతలు ఒకరినొకరు పొగుడుకుంటూ సభను ముగించారు. ఈ క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభ లో మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. గత ఎన్నికల్లో యూపీలో సమాజ్ వాది పార్టీని ఘోరంగా ఓడించిన మోడిపట్ల ఆయన సానుకూలంగా వ్యవహరించారు. లోక్ సభ సాక్షిగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగిడారు. 2019 లో మరోసారి మోదీ ప్రధాని కావాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. అలాగే సభలో ఉన్న ఎంపీలందరూ తిరిగి ఎన్నిక కావాలని కోరుకుంటున్నట్టు ములాయం తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఖంగుతినగా.. బీజేపీ ఎంపీలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇక్కడ విశేషమేమంటే ములాయం ప్రధానిని పొగుడుతున్న సమయంలో ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ నిర్ఘాంత పోయారు.
లైవ్ టీవి
కథ...మహా...ఇంకా లక్ష్మి నాయకుడా?
23 Feb 2019 11:08 AM GMTయుగపురుషుడిగా ఎన్టీఆర్
23 Feb 2019 10:45 AM GMTశ్రీ శ్రీ గారు అనుకుంటే..పప్పులో కాలు వేసినట్టే!
23 Feb 2019 10:39 AM GMTమహానాయకుడి చరిత్ర నుండి కొన్ని పేజీలు మాత్రమే!
23 Feb 2019 10:01 AM GMTనాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMT