నీటిహక్కు చట్టాన్ని తీసుకురానున్న మధ్యప్రదేశ్‌

నీటిహక్కు చట్టాన్ని తీసుకురానున్న మధ్యప్రదేశ్‌
x
Highlights

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నీటి హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చట్టం ప్రకారం ప్రతి మనిషికి రోజుకు...

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నీటి హక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చట్టం ప్రకారం ప్రతి మనిషికి రోజుకు 55లీటర్ల చొప్పున సరఫరా చేస్తారు. నీటి వృథాను అరికట్టి సమస్య ఉన్న ప్రాంతాలకు మిగులు జలాలను పంపిస్తారు. దీనికోసం జూన్‌ 24న భోపాల్‌లో సెమినార్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి రాజేందర్‌ సింగ్‌తో పాటు న్యాయ నిపుణులు సంజయ్‌ ఉపాధ్యాయ, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొంటారు. ఒక వేళ ఈ చట్టాన్ని అమలు పరిస్తే నీటి హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా మధ్య ప్రదేశ్‌ నిలుస్తుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుఖ్‌దేవ్‌ పెన్సాయ్‌ తెలిపారు.ఇప్పటికే ఈ చట్టాన్ని తీసుకురావాల్సింది కానీ ప్రజాభిప్రాయాన్ని సేకరించడంతో ఆలస్యమైంది. ఎండాకాలంలో నీటి ఎద్దడి పెరగడంతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు నీటి కరవుతో అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితి మధ్యప్రదేశ్‌కు తలెత్తకూడదన్న ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమవుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. జీవించే హక్కులో నీటిహక్కు కూడా భాగమే. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లో ఉన్న జీవించే హక్కు చట్టం పరిధిలోకే ఈ నీటి హక్కు చట్టం కూడా రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories