ఆఫ్రీది గంభీర్ ని చూసి నేర్చుకో .... మానవత్వం చాటుకున్న బీజేపీ ఎంపీ

ఆఫ్రీది గంభీర్ ని చూసి నేర్చుకో .... మానవత్వం చాటుకున్న బీజేపీ ఎంపీ
x
Highlights

ఇండియన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మానవత్వం చాటుకున్నాడు. పాకిస్తాన్ కి చెందినా ఉమామియా అలీ అనే ఆరేళ్ళ చిన్నారి గుండెకు సంబంధిత...

ఇండియన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మానవత్వం చాటుకున్నాడు. పాకిస్తాన్ కి చెందినా ఉమామియా అలీ అనే ఆరేళ్ళ చిన్నారి గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. అయితే మెరుగైన చికిత్స కోసం ఇండియాకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసారు. కానీ వీసా దగ్గర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ పాకిస్తాన్ మాజీ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ గంభీర్‌కు ఫోన్ చేసి చెప్పాడు.

దీనిపై చొరవ తీసుకున్న గంభీర్ వీసా కోసం కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరారు. దీనిపై అక్టోబర్ 9వ తేదీన విదేశాంగ శాఖ మంత్రి నుండి గంభీర్ కి రిప్లేయ్ వచ్చింది. దీనితో పాకిస్థానీ చిన్నారికి మరియు ఆమె తల్లిదండ్రులకు భారత వీసా అందింది. వైద్యం కోసం పాకిస్థాన్ నుండి వస్తున్నా ఆ చిన్నారికి స్వాగతం అంటూ ట్విట్టర్ లో స్పందించారు గంభీర్. తానూ ఎప్పుడు ఉగ్రవాదాన్ని పెంచిపోషించే ఐఎస్ఐ లకే మాత్రమే వ్యతిరేకీనని.. పాకిస్తాన్ ప్రజలకి కాదని చెప్పాడు గంభీర్..

గంభీర్ చూపించిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గంభీర్ ని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. ఇక ఇంకొంతమంది నెటిజన్లు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది కి ట్యాగ్ చేస్తూ గంభీర్ ని చూసి నేర్చుకో అని సలహాలు ఇస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories