విభజనలో లోపాలే ఇబ్బందులకు కారణం

బీజేపీ హయాం లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,బీహార్ రాష్ట్రాలను విభజన చేశారు. ఆ సమయంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు...
బీజేపీ హయాం లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,బీహార్ రాష్ట్రాలను విభజన చేశారు. ఆ సమయంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా. వారి మనసులు గాయపడకుండా వ్యవహరించారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విభాజన విషయంలో గందరగోళం ఏర్పడింది. ఇది ఇప్పటికీ సమస్యగానే మిగిలింది. అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వారణాసిలో ఏర్పాటు చేసిన బీజీపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ రకంగా వ్యాఖ్యానించారు.
తనకు కార్యకర్తల మాటే వేదం అని ఈ సందర్భంగా చెప్పారు. గత నెల 25 న బహిరంగ సభ అనంతరం మళ్లీ నెల రోజుల తరువాతే నియోజకవర్గానికి విజయోత్సవానికి రావాలని కార్యకర్తలు కోరారు. ఆ విధంగానే నేను ఇప్పటివరకూ నియోజకవర్గంలో కాలు పెట్టలేదని చెప్పుకోచ్చారు. నాపై నమ్మకం ఉంచి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మండే ఎండలను సైతం పట్టించుకోకుండా బయటకు వచ్చి భాజపాకు ఓటేశారు. పార్టీ కార్యకర్తలు నా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రతి ఇంటి నుంచి ఒక మోదీ వచ్చి ప్రచారం చేశారు. అంటూ అయన కార్యకర్తలను కొనియాడారు.
రాజకీయాలకు ఉత్తరప్రదేశ్ సరికొత్త మార్గాన్ని నిర్దేశించిందని.. 2014, 2017, 2019 ఎన్నికల్లో హాట్రిక్ విజయాలు సాధించడం చిన్న విషయం కాదని మోదీ అన్నారు. ఇంత జరిగినా రాజకీయ పండితుల ఇంకా కళ్లు తెరుచుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో లెక్కల కంటే నాయకులు, ప్రజల మధ్య బంధం ముఖ్యమని వారు ఇకనైనా తెలుసుకోవాలని అన్నారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
CIBIL Score: పర్సనల్ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMTBandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
14 Aug 2022 11:27 AM GMTవైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం...
14 Aug 2022 11:05 AM GMTStress: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడి.. ఎలా బయటపడాలంటే..?
14 Aug 2022 10:30 AM GMTఖమ్మం జిల్లా ఖాన్‌పేట్‌లో భట్టి విక్రమార్క పాదయాత్ర
14 Aug 2022 10:27 AM GMT