మొనగాడు మోడీ!

మొనగాడు మోడీ!
x
Highlights

అవును.. సొంత మెజార్టీతో వరుసగా రెండోసారి ఎన్నికైన ప్రధానిగా చరిత్ర సృష్టించారు ప్రధాని మోడీ. ఈ విజయం పూర్తిగా మోడీ విజయమే. గత ఎన్నికల్లో ఆయన సాధించిన...

అవును.. సొంత మెజార్టీతో వరుసగా రెండోసారి ఎన్నికైన ప్రధానిగా చరిత్ర సృష్టించారు ప్రధాని మోడీ. ఈ విజయం పూర్తిగా మోడీ విజయమే. గత ఎన్నికల్లో ఆయన సాధించిన విజయం వెనుక ఎన్నో సమీకరణాలు.. మరెన్నో కారణాలు ఉన్నాయి కానీ.. ఇపుడు మాత్రం కేవలం ఆయన పేరే బ్రాండ్ గా బీజేపీ విజయం సాధించింది. ఇపుడు నెట్లో ఓ చిన్న వాక్యం హల్ చల్ చేస్తోంది. అందరూ నోట్లు పంచి గెలిస్తే.. మోడీ నోట్లు రద్దు చేసి గెలిచారు అనే ఆ వాక్యం సోషల్ మీడియా లో వైరల్ అయింది. నిజమే.. నోట్ల రద్దు వైఫల్యమే అనీ, ప్రజలు హర్షించలేదనీ చెప్పిన విపక్షాల నోర్లు మూట పడేలా ఆయన విజయం సాధించారు.

హిందీ రాష్ట్రాలే గెలిపించాయి..

బిహార్‌, చత్తీస్‌గఢ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, దిల్లీలో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది. ఇందులో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. రాష్ట్రాల ఎన్నికల్లో అక్కడి స్థానిక పరిస్థితులూ, కులాల అధిక్యతలూ ప్రభావం చూపించాయి. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం మోడీ హవానే కనిపించింది. ప్రధానిగా అవతలి పక్షం లో ఎవరుంటారో తెలీని స్థితిలో.. కచ్చితంగా మోదీ నే బీజేపీ పక్షం ప్రధాని అని స్పష్టంగా తెలియడం తో ఎటువంటి అనుమానమూ లేకుండా.. మోడీ కి తమ ఆమోదముద్రను వేసేశారు ప్రజలు.

ఇక పశ్చిమ బెంగాల్, ఓడిశాలో కోద్ద బీజేపీ కి మద్దతు లభించింది. ఇది మోడీ విజయమే. ఇక తెలంగాణాలో 4 సీట్లను గెలుచుకుని సత్తా చూపించింది.

ఇందిరాగాంధీ లానే మోడీ కూడా బలమైన ప్రజా నాయకుడిగా ఈ ఎన్నికలతో ముద్ర వేశారు.

014లో భాజపాకు సొంతంగా మెజార్టీ వచ్చినా.. ఎన్‌డీఏ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి కూడా పూర్తి స్థాయిలో సొంతంగా బలం సంపాదించుకొంది. దీంతో మోదీ చాలా స్వతంత్రంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొన్నారు. వీటిలో కొన్ని ప్రజలను ఇబ్బంది పెట్టినా.. ధైర్యవంతుడైన మొండి పాలకుడిగా మోదీ ఇమేజ్‌ పెరిగిపోయింది. భాజపాకు సొంత బలం ఉన్నా.. కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పాలనపై మోదీకి తిరుగులేని పట్టు వచ్చింది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఈ వెసులుబాటు లభించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories