విమానాల్లో టికెట్ ధరలు కనిష్టంగా 3000 రూపాయలు

విమానాల్లో టికెట్ ధరలు కనిష్టంగా 3000 రూపాయలు
x
Highlights

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ S.O.Pని ప్రకటించింది. విమాన ఛార్జీల సవరణ గురించి కూడా S.O.P లో పేర్కొన్నారు. మంత్రి...

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ S.O.Pని ప్రకటించింది. విమాన ఛార్జీల సవరణ గురించి కూడా S.O.P లో పేర్కొన్నారు. మంత్రి హర్‌దీప్ సింగ్ పురి కొత్త విమాన ప్రయాణాల మార్గదర్శకాల గురించి వివరించారు.

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విమాన టికెట్ ధరలను కూడా కేంద్రం సవరించింది. దేశీయ విమానాల్లో టికెట్ ధరలు కనిష్టంగా 3000 రూపాయలు గరిష్టంగా 10వేలు ఉంటుందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తి తెలిపారు. మెట్రో నగరాల్లో మూడో వంతు సర్వీసులు మాత్రమే నడుస్తాయని చెప్పారు. నాన్ మెట్రో నగరాల్లో పూర్తి స్థాయిలో సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఢిల్లీ-ముంబై రూట్లో టికెట్ గరిష్ట ధర 10వేలుగా ఉంటుందని తెలిపారు హర్దీప్ సింగ్ పూరి.

ప్రయాణ సమయాన్నిబట్టి రూట్లను ఏడు విధాలుగా విభజించినట్లు మంత్రి తెలిపారు. 30 నిమిషాల లోపు ప్రయాణాలు, 30 నుంచి 60 నిమిషాలు, 60 నుంచి 90 నిమిషాలు, 90 నుంచి 120 నిమిషాలు, 120 నుంచి 150 నిమిషాలు, 150 నుంచి 180 నిమిషాలు, 180 నుంచి 210 నిమిషాలని మంత్రి వివరించారు.

నోవల్ కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలవుతుండటంతో మార్చి 25 నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసెస్‌ను నిలిపివేసింది. మే 25 నుంచి తిరిగి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కావడంతో ప్రయాణికుల్లో సందడి మొదలయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories