పాలు ఇలా కూడా పోస్తారా.. అతని ఐడియాకి శభాష్ అనాల్సిందే!

పాలు ఇలా కూడా పోస్తారా.. అతని ఐడియాకి శభాష్ అనాల్సిందే!
x
Highlights

కరోనావైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కరోనా నియంత్రణకి సామాజిక దూరం

కరోనావైరస్ యొక్క వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే కరోనా నియంత్రణకి సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీనితో ఇప్పుడు సామజీక దూరం అనేది మనిషి రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపొయింది. ఈ నేపధ్యంలో సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ వినియోగదారులకు పాలు అందించడానికి ఒక మిల్క్ మ్యాన్ ఆలోచించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించడానికి సదరు మిల్క్ మ్యాన్ బైకుకు సుమారు మీటరు పొడవుండే ఓ ప్లాస్టిక్ పైపు పెట్టి, దానికి ఒక గళాను పెట్టాడు. వినియోగదారులు గిన్నె పట్టుకుని ఆ పైపు వద్ద గిన్న పెడితే.. అతడు ఆ గళాలో పాలు పోస్తున్నాడు. అవి నేరుగా గిన్నెలోకి వెళ్తున్నాయి. దీనిని ఐఏఎస్‌ అధికారి నితిన్‌ సంగ్వాన్‌ ట్విటర్‌లో ఈ ఫొటో పోస్ట్‌ చేశారు.

దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు మిల్క్ మ్యాన్ ఆలోచనకి ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ప్రశంసిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories