ఢిల్లీ అల్లర్లు .. 12 రోజులకే ప్రేమించి పెళ్ళాడిన భర్త మృతి

ఢిల్లీ అల్లర్లు .. 12 రోజులకే ప్రేమించి పెళ్ళాడిన భర్త మృతి
x
ఢిల్లీ అల్లర్లు .. 12 రోజులకే ప్రేమించి పెళ్ళాడిన భర్త మృతి
Highlights

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ భార్య అయన భర్తను కోల్పోయింది. కొత్తగా పెళ్లి అయి వైవాహిక జీవితం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకి ఢిల్లీ అల్లర్ల శోకసంద్రంలో ముంచాయి.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ భార్య అయన భర్తను కోల్పోయింది. కొత్తగా పెళ్లి అయి వైవాహిక జీవితం పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమెకి ఢిల్లీ అల్లర్ల శోకసంద్రంలో ముంచాయి. వాలైంటైన్స్ డే రోజున ఆష్వాక్‌ హుస్సేన్‌కు, తస్లీన్ ఫాతిమాకి పెళ్లి జరిగింది. ఇద్దరు ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. కానీ చూడచక్కని ఈ జంటకి ఢిల్లీ అల్లర్లు శాపంగా మారాయి.. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన ఆష్వాక్‌ హుస్సేన్‌ ఆ అల్లర్లలో తన ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి పంచుకున్న మొదటి భోజనం ఇది. అయితే ఆష్వాక్‌ ని పొడిచి చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే ఆష్వాక్‌ హుస్సేన్‌ ఫోటోను తన భార్య అయిన తస్లీన్ ఫాతిమా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన భర్త గురించి తనకి పూర్తి వివరాలు తెలియకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడంటూ రోదిస్తుంది. ఇక ఆష్వాక్‌ హుస్సేన్‌ మృతి గురించి అతని కుటుంబ సభ్యులకి చాలా ఆలస్యంగా తెలిసింది. ఘర్షణలో గాయపడిన అనంతరం అతన్ని న్యూ ముస్తఫాబాద్‌లోని అల్ హింద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. అయినప్పటికీ అతని మరణం గురించి అతని కుటుంబ సభ్యులకి చెప్పలేదు.. పోలీసులు ఫోన్ చేసి పోస్టు మార్టం పూర్తయిందని, శవాన్ని తీసుకెళ్లమంటూ చెప్పేవరకు తెలియదని ఆష్వాక్‌ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ అల్లర్లులో చనిపోయినవారికి ఢిల్లీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఇందులో మరణించిన వారికి వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు రూపాయలు, గాయపడిన వారికి రూ. 5 లక్షలు, చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, శాశ్వత వైకల్యం కలిగితే రూ. 5 లక్షలు, అనాథలుగా మిగిలిన వారికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. అల్లర్లలో గాయపడిన మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరిన వారికి చికిత్స ఖర్చులను డీల్లీ ప్రభుత్వం భరిస్తుందని అన్నారు.

ఇక ఈ ఘటనకి పాల్పడిన వారిలో దోషులుగా తేలితే వారికి కఠినమైన శిక్ష విధించాలని, అందులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు చెందినవారైతే జరిమానాను రెట్టింపు చేయాలని ఆయన అన్నారు. జాతీయ భద్రత విషయంలో రాజకీయాలు ఉండకూడదని కేజ్రివాల్ అభిప్రాయపడ్డారు. కాగా అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 42కు చేరింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories