ప్రార్థనలకు వెళ్లివచ్చారు..ప్రమాదాన్ని అబద్ధంతో కప్పి..ముప్పులో ముంచేస్తున్నారు!

ప్రార్థనలకు వెళ్లివచ్చారు..ప్రమాదాన్ని అబద్ధంతో కప్పి..ముప్పులో ముంచేస్తున్నారు!
x
Highlights

చైనా లో కరోనా మహమ్మారి ప్రజల్ని మింగేస్తోంది. సిటీలు లాక్డౌన్ అయిపోతున్నాయి. ఇటువంటి వార్తలు నాలుగు నెలల క్రితం విన్నపుడు మన దేశంలో అందరికీ ఒక సందేహం...

చైనా లో కరోనా మహమ్మారి ప్రజల్ని మింగేస్తోంది. సిటీలు లాక్డౌన్ అయిపోతున్నాయి. ఇటువంటి వార్తలు నాలుగు నెలల క్రితం విన్నపుడు మన దేశంలో అందరికీ ఒక సందేహం వచ్చింది. అది కరోనా మన దేశంలోకి వస్తే పరిస్థితి ఏమిటి? అని. ఇప్పడు అదే జరిగింది. మనదేశంలోకి ఆ రాకాసి వచ్చింది. ప్రభుత్వాలు అవసరమైన చర్యలూ చేపట్టారు. దేశం మొత్తం ఇంటికే పరిమితం అయిపోయే పరిస్థితి వచ్చింది. దేశంలో ప్రవేశించిన మహమ్మారిని తరిమి కొట్టగలమనుకుంటూ దేశ ప్రజలు విశ్వాసంలో ఉన్నారు. సరిగ్గా వారి విశ్వాసాన్ని దేబ్బకోట్టేలా ఒక విస్ఫోటనం రేగింది. అది నిజాముద్దీన్ మర్కాజ్ వ్యవహారం. ఒక ప్రార్త్ధనా పరమైన సమావేశం భారత్ కొంప ముంచింది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని అతలాకుతలం చేసేసింది. ఈ వ్యవహారంలో వైఫల్యం ఎక్కడనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆ ప్రార్థనలలో పాల్గొని ఇళ్ళకు చేరుకున్న వారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరినీ నిప్పుల కుంపటి పై కూచో పెట్టింది.

మర్కాజ్ ప్రార్థనల వ్యవహారం బయటకు వచ్చినవెంటనే.. ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యాయి. యంత్రాంగాలన్నీ ఆ ప్రార్థనలలో పాల్గొని తిరిగి వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యాయి. అయితే, అధికారులకు ఆ ప్రార్థనలకు వెళ్ళివచ్చిన వారిదగ్గర నుంచి సహకారం లభించడం లేదు. పైగా వాస్తవాలను దాచిపెడుతున్నారు. దీంతో ప్రజల ప్రాణాలు ఇప్పుడు గాలిలో ఉన్నపరిస్థితి.

నేను వెళ్ళలేదు..

హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఒక ఇస్రో అధికారి నిజాముద్దీన్ ప్రార్థనలలో పాల్గొన్నట్టు కేంద్ర అధికారులు జీహెచ్ఎంసీ కి సమాచారం ఇచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు సదరు ఇస్రో అధికారి ఇంటికి విచారణ కోసం వెళ్ళారు. అక్కడ ఆయన నేను అసలు ఇల్లే కదల లేదని చెప్పారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆధారాలు అడిగారు. అప్పుడు అయన తాను రిజర్వేషన్‌ చేసుకున్న రైలు టికెట్‌తో.. ఇంకో వ్యక్తి వెళ్లారని పూర్తి వివరాలు చెప్పారు. స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించారు.

టిక్కెట్టు లేకుండానే..

అధికారులకు ఈ విషయంలో వింత అనుభవాలు.. విస్మయకర విషయాలు తెలుస్తున్నాయి. ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అధికారులు క్వారంటైన్ కు తరలించారు. అయితే, క్వారంటైన్ కి వెళ్ళిన వారు అధికారులకు మాతో పాటూ ఇంకో వ్యక్తీ టికెట్ లేకుండా వచ్చాడు అని షాకిచ్చారు. దీంతో అధికారులు హుటాహుటిన సదరు వ్యక్తీ ఇంటికి వెళ్లారు.అక్కడ వారికి తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది. ఆ కరోనా అనుమానితుడు దొరకలేదు. దేంతో అక్కడి మత పెద్ద సహకారంతో పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి క్వారంటైన్ కు తరలించారు.

ఇప్పటికీ సగం మంది జాడ లేదు..

కేంద్ర సమాచారం ప్రకారం ఎల్బీనగర్‌ జోన్‌లో 16, సికింద్రాబాద్‌లో 37, కూకట్‌పల్లిలో 33, శేరిలింగంపల్లిలో 22, ఖైరతాబాద్‌లో 54, చార్మినార్‌లో 187 మంది నిజాముద్దీన్ వెళ్లివచ్చారు. వీరిని గుర్తించడంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో సగం మందికి పైగా ఇప్పటివరకూ అధికారులకు దొరకలేదు.

ఎందుకీ పరిస్థితి..

నిజానికి కేంద్రం రైళ్ళ టికెట్ల ఆధారంగా ఈ మత ప్రార్థనలకు హాజరైన వారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి అక్రమ మార్గాల్లో అంటే.. టికెట్ లేకుండా వెళ్ళడం.. ఇతరుల పేరుపై ప్రయాణించడం వంటివి ఎక్కువగా ఉన్నాయి. దీంతో అసలు వారిని గుర్తించడం సాధ్యం కావడం లేదు. కరోనా తెచ్చే ముప్పు తెలిసీ వీరు ఇలా తప్పించుకు తిరగడం ఆందోళన కలిగిస్తోంది.

కఠినంగా వ్యవహరించాలి..

ఇలా తప్పించుకు తిరుగుతున్న వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తెలిసీ సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న వీరిని ఉపేక్షిస్తే మిగిలిన సమాజానికి పెనుముప్పు తప్పదు. కచ్చితంగా వారిని గుర్తించడం అత్యవసర విషయంగా మారింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉంది ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలి. అనుమానిత వ్యక్తుల గురించి వారు తమ కుటుంబ సభ్యులైనా సరే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందే. ఎందుకంటే, మీ కుటుంబ సభ్యునిపై ప్రేమ మీ కుటుంబం మొత్తాన్ని కూడా చావు వైపు తీసుకువెళుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories