ముంబయి బీచ్ లో సూట్ కేస్...

ముంబయి బీచ్ లో సూట్ కేస్...
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ సూట్ కేస్ బీచ్ లో కలకలం సృష్టించిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి మాహిం బీచ్ లో చోటుచేసుంది. పోలీసులు తెలిపిన...

సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ సూట్ కేస్ బీచ్ లో కలకలం సృష్టించిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయి మాహిం బీచ్ లో చోటుచేసుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే సోమవారం సాయంత్రం బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన సూట్కెస్ ను కొంతమంది గమనించారని తెలిపారు. దాంతో పాటు నీటిలో ఓ మనిషి కాలు కూడా కొట్టుకు రావడాన్ని గమనించారన్నారు. దీంతో భయపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సూట్ కేస్ స్వాధీనం చేసుకుని తెరచిచూడగా అందులో మనిషి శరీర విడిభాగాలు ఉన్నాయన్నారు. దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారన్నారు. దీంతో వెంటనే పోలీసులు శరీర భాగాలను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ తప్పిపోయిన వాళ్ల రికార్డులను పరిశీలిస్తున్నామని. ఈ వ్యక్తి ఎవరు ఏంటి అన్న విషయాలను గురించి ఆరా తీస్తున్నామని తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories