Top
logo

Mamata Banerjee :వైద్యులకి కృతజ్ఞతగా జులై1న సెలవుదినంగా ప్రకటించిన సీఎం మమత

Mamata Banerjee :వైద్యులకి కృతజ్ఞతగా జులై1న సెలవుదినంగా ప్రకటించిన సీఎం మమత
X
Highlights

Mamata Banerjee :ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడంలో వైద్యుల పాత్ర వెలకట్టలేనిది.. తమ ప్రాణాలని ఫణంగా పెట్టి మరి కరోనా భాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొన్నికొన్ని చోట్లల్లో వైద్యులు కూడా కరోనా బారినా పడ్డారు.

Mamata Banerjee: ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడంలో వైద్యుల పాత్ర వెలకట్టలేనిది.. తమ ప్రాణాలని ఫణంగా పెట్టి మరి కరోనా భాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొన్నికొన్ని చోట్లల్లో వైద్యులు కూడా కరోనా బారినా పడ్డారు. మరికొందరు మృతి చెందారు.. అయితే వారి సేవలకి గాను వైద్యులకు వందనం అంటూ జులై 1ని సెలవుదినంగా ప్రకటించారు సీఎం మమత.. జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వారి గౌరవార్థం కోసం తమ రాష్ట్రంలో సెలవు రోజుగా ప్రకటిస్తున్నట్లు ఆమె సోమవారం (జూన్ 29) తెలిపారు. ఇక కేంద్రం కూడా దీనిని పాటించాలని మమతా కోరారు..

ఇక తమ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో తమ రాష్ట్రం క్రీయాశిలకంగా వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. వైరస్‌ నియంత్రణపై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టమని, ఇక ప్రజలు కూడా తమకి సహకరించాలని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివే కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. ఇక తమ ప్రభుత్వం 3 కోట్ల మాస్కులను కొనుగోలు చేసిందని, 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ మాస్కులని అన్ని రంగాల వారికి పంపిణి చేసేందుకు ప్లాన్ చేస్తునట్టుగా మమతా వెల్లడించారు.

ఇక పచ్చిమ బెంగాల్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17,283కి చేరింది. ఇందులో 11,193 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు కరోనాతో 639 మంది మృతి చెందారు. ఇక కరోనా వ్యాప్తిని మరింతగా అడ్డుకోవడానికి ఇప్పటికే పచ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం జులై 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.

ఇక అటు దేశవ్యాప్తంగా కూడా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,459 కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి మొత్తం 5,48,318 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,10,120 ఉండగా, 3,21,722 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 16,475 మంది కరోనా వ్యాధితో మరణించారు.

Web TitleMamata Banerjee: Bengal CM Mamata Banerjee Declares National Doctor's Day On July 1 As State Holiday
Next Story