కుమారస్వామి వద్దని ముందే చెప్పాను: దేవెగౌడ

కుమారస్వామి వద్దని ముందే చెప్పాను: దేవెగౌడ
x
Highlights

అనేక మలుపులు తిరుగుతున్న కర్నాటకలో ప్రభుత్వం కూలిపోయినా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ తెగ హంగామా...

అనేక మలుపులు తిరుగుతున్న కర్నాటకలో ప్రభుత్వం కూలిపోయినా రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ తెగ హంగామా చేసిన కమల దళం వ్యూహాత్మకంగా మౌనం దాల్చుతుంటే రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ కొరడా ఝుళిపించారు. ఇక రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే దినిపై మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ స్పందించారు. తన కుమారుడు కుమారస్వామిని కర్ణాటక సీఎంగా పదవి పగ్గాలు చేపట్టడంపై ముందే తాన అభ్యంతం వ్యక్తం చేశానని ఓ ఇంగ్గీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు దేవెగౌడ. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే ఆ స్థానం కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే సీఎం అవుతారని భావించానన్నారు దేవెగౌడ. జేడీఎస్‌కు 37, కాంగ్రెస్‌కు 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మల్లిఖార్జున ఖర్గే, పరమేశ్వర, మునియప్పలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని అనుకున్నాని అన్నారు. కానీ కుమారస్వామిని సీఎం చేయాలని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ నిర్ణయించారని దేవెగౌడ చెప్పారు. కాగా ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడ్డ పరిస్థితులతో తాను ఎలాంటి ఆశ్చర్చానికి గురికాలేదంటూ వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories