మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేలు జారిపోకుండా పహారా

మహారాష్ట్రలో క్యాంప్ రాజకీయాలు.. ఎమ్మెల్యేలు జారిపోకుండా పహారా
x
మహారాష్ట్ర
Highlights

మహారాష్ట్ర సంక్షోభం కేసుపై కాసేపట్లో సుప్రీంలో విచారణకు రానుంది. బలపరీక్షపై ఇవాళ నిర్ణయం తెలుపుతామని చెప్పింది. అయితే గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ...

మహారాష్ట్ర సంక్షోభం కేసుపై కాసేపట్లో సుప్రీంలో విచారణకు రానుంది. బలపరీక్షపై ఇవాళ నిర్ణయం తెలుపుతామని చెప్పింది. అయితే గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు అందించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ పంపిన లేఖతో పాటు బీజేపీకి మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖలను కోర్టుకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది. లేఖలు అందిన తర్వాత బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలకు తెరలేచింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు స్టార్ హోటళ్లకు తరలించాయి. ఫడ్నవీస్ సర్కారు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉండడంతో బీజేపీకి దొరక్కుండా ఉండేందుకు ఆ మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను స్టార్ హోటళ్లలో ఉంచి కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను జుహూ ఏరియాలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌కు, శివసేన ఎమ్మెల్యేలను ఎయిర్ పోర్టు సమీపంలోని లలిత్ హోటల్‌కు, ఎన్సీపీ ఎమ్మెల్యేలను రెనాసెన్స్ హోటల్‌కు తరలించారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories