మే31 వరకు లాక్ డౌన్ పొడిగించిన మహారాష్ట్ర సర్కార్!

మే31 వరకు లాక్ డౌన్ పొడిగించిన మహారాష్ట్ర సర్కార్!
x
Uddhav Thackeray(File photo)
Highlights

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగుస్తుండడంతో పొడిగింపు విషయంపైన కేంద్రప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు...ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ 3.0 నేటితో ముగుస్తుండడంతో పొడిగింపు విషయంపైన కేంద్రప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వలేదు...ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మే31 వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టకపోవడం వల్లే లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది..

దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది.. అక్కడ కరోనా కేసులు 30,000 దాటేయగా, 1,135 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయి నగరంలోనే 18,555 మందికి వైరస్ నిర్ధారణ కాగా, దాదాపు 700 మంది చనిపోయారు. ఇక కరోనా పై అలుపెరగని పోరాటం చేస్తున్న అక్కడి వైద్యలకు, పోలీసులు కూడా కరోనా బారిన పడ్డారు. మహారాష్ట్ర పోలీస్ విభాగంలో మొత్తం 1,206 మందికి వైరస్ సోకగా.. వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. .

దీనితో కరోనా తీవ్రత మరింతగా తగ్గాలంటే లాక్ డౌన్ ని పొడిగించక తప్పని క్రమంలో మహారాష్ట్ర సర్కార్ లాక్ డౌన్ ని పొడిగుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అత్యధిక కేసులు రెడ్ జోన్‌లలో ముఖ్యంగా అత్యధిక కేసులు నమోదవుతున్న ముంబయి, పుణే, మలేగావ్, పింప్రి-చించువాడ లాంటి చోట్లల్లో లాక్ డౌన్ నిబంధనలను మరింతగా కట్టుదిట్టం చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే లాక్‌డౌన్‌పై కార్యాచరణ రూపొందించి, నివేదికను కేంద్రానికి పంపారు.

విమానాలు, రైలు సేవలను ప్రారంభించవద్దని ఇప్పటికే కేంద్రాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. వలస కూలీల విషయంలో ఉద్ధవ్ సర్కారు ముందు నుంచీ ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది.

లాక్ డౌన్ 3.0 ముగుస్తున్నప్పటికి కరోనా కేసులు ఎక్కడకూడా తగ్గుముఖం పట్టడం లేదు.. దేశవ్యాప్తంగా కరోనా కేసులను ఒక్కసారిగా చూసుకుంటే ఇప్పటి వరకు 90,648 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఇందులో 2,871 మంది చనిపోగా, కరోనా నుంచి కోలుకుని నుంచి 34,224 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో 3,970 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వ్యాధి కారణంగా 103 మంది చనిపోయారు.

దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories