ప్రేమ వివాహం చేసుకోం ... వరకట్నాన్ని తిరస్కరిస్తాం : విద్యార్థినుల ప్రమాణం

ప్రేమ వివాహం చేసుకోం ... వరకట్నాన్ని తిరస్కరిస్తాం : విద్యార్థినుల ప్రమాణం
x
Highlights

ప్రేమికుల దినోత్సవం రోజున మహారాష్ట్రలోని ఆల్-గర్ల్స్ కాలేజీలోని యాజమాన్యం విద్యార్థులు చేత ప్రేమ వివాహం అనే భావనకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించుకుంది....

ప్రేమికుల దినోత్సవం రోజున మహారాష్ట్రలోని ఆల్-గర్ల్స్ కాలేజీలోని యాజమాన్యం విద్యార్థులు చేత ప్రేమ వివాహం అనే భావనకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించుకుంది. చందూర్ రైల్వేలోని మహిళ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థులు మరాఠీలో "మాకు మా తల్లిదండ్రులపై పూర్తి నమ్మకం ఉంది. మేము ప్రేమలో పడిపోం, ప్రేమ వివాహాలు చేసుకోం, వరకట్నం అడిగే వారిని కూడా మేము తిరస్కరిస్తాం. మాకు మా తల్లితండ్రులే విధేయులుగా భావిస్తాం" అని అందరు మూకుమ్మడిగా ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

దీనిపైన మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ మాట్లాడుతూ, ఎవరి మాయలో పడబోమని విద్యార్థులు కచ్చితంగా ఇలాంటి ప్రమాణం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రేమ వేధింపుల నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి ప్రమాణం చేయించినట్టుగా కాలేజీ నిర్వాహకులు వెల్లడించారు. దీనికి ఆ విద్యార్థినులు సైతం మద్దతు తెలిపారు. ఆ కళాశాలలోని ఓ విద్యార్ధిని మాట్లాడుతూ.. " ప్రేమ వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏంటి ? పెళ్లి విషయాలపై మా తల్లిదండ్రులు భావాలు ఉత్తమమైనవి. మనకి ఇష్టానుసారంగానే తల్లితండ్రులు పెళ్ళిళ్ళు చేస్తారు" అని చెప్పుకొచ్చింది

ఇక మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని హింగాన్‌ఘాట్ సమీపంలో ఓ మహిళ లెక్చరర్ ని ఓ వివాహితుడు ప్రేమ పేరుతో వేధించి పెట్రోల్ పోసి నిప్పటించిన సంగతి తెలిసిందే.. పెళ్లికాని ఆ మహిళ లెక్చరర్ సుమారు 40 శాతం కాలిన గాయాలతో బాధపడుతూ నాగ్‌పూర్‌కు చెందిన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories