ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఉద్ధ‌వ్ నామినేష‌న్‌.. ఎన్నిక లాంఛనమే!

ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా ఉద్ధ‌వ్ నామినేష‌న్‌.. ఎన్నిక లాంఛనమే!
x
Highlights

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మే 21న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు ఉద్ధవ్‌ నేడు నామినేషన్‌ దాఖలు...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మే 21న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు ఉద్ధవ్‌ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఆయన సతీమణి రశ్మీ ఠాక్రే, కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్యా ఠాక్రేతో కలిసి స్థానిక కార్యాలయంలో నామినేషన్ ప్రతాలను సమర్పించారు.

మిత్రపక్షమైన కాంగ్రెస్ ఒకరికి బదులు ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపి, ఉద్ధవ్‌కు ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఒక అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్నామని ఆదివారం ప్రకటించారు. ఎట్టకేలకు చివరి క్షణంలో కాంగ్రెస్‌ వెనక్కి తగ్గడంతో ఠాక్రే ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే ఠాక్రే ఎన్నికల కాంగ్రెస్‌, ఎన్సీపీ మద్దతు ప్రకటించడంతో ఆయన ఎన్నికల ఏకగ్రీవం కానుంది. ఆయన పోటీ చేసే స్థానానికి ఠాక్రే ఒక్కరు మాత్రమే నామినేషన్‌ వేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories