థర్డ్‌ జెండర్‌లను ఏ జైల్లో నిర్బంధించాలి?

థర్డ్‌ జెండర్‌లను ఏ జైల్లో నిర్బంధించాలి?
x
Highlights

సాధారణంగా నేరం చేసిన వాల్లని జైలులో బంధిస్తుంటారు. అందులో కూడా పురుషులు, మహిళలు, 18 సంవత్సరాలు నిండని వారినైతే బోస్టల్ స్కూల్లలో వేస్తుంటారు.

సాధారణంగా నేరం చేసిన వాళ్ళని జైలులో బంధిస్తుంటారు. అందులో కూడా పురుషులు, మహిళలు, 18 సంవత్సరాలు నిండని వారినైతే బోస్టల్ స్కూల్లలో వేస్తుంటారు. ప్రతి క్యాటగిరి వాల్లకి జైల్లు ఉన్నాయి. కానీ థర్డ్‌ జెండర్‌ అంటే ( హిజ్రా)లకు ప్రత్యేక జైల్లు లేవు. మరి ఒక వేల వారు ఏదైనా తప్పుచేస్తే వారిని ఏ జైల్లో వేస్తారు. ఈ ప్రశ్న దాదాపుగా అందరినీ ఆలోచించేలా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే హిజ్రాలను ఎక్కడ నిర్బంధించాలని అనే అంశంపై మద్రాస్‌ హైకోర్టు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుని ఆదేశాలను జారీ చేసింది.

తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్‌ కోర్టులకు హైకోర్టు కొత్త నింబంధనలు రూపొందించింది. ఈ నింబంధనలను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో విడుదల చేసింది. అక్కడి కోర్టుకు వచ్చిన ఓ కేసు విచారణ నిమిత్తం హై కోర్టు కింది కోర్టులకు ఉత్తర్వులను జారీచేసింది. ప్రస్తుతం హైకోర్టు విధించిన నూతన నిబంధనల ప్రకారం అరెస్టయిన వారిని నేరుగా హాజరుపరిస్తే మాత్రమే వారిని జైలులో నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. ఏదైనా నేరం చేసి హిజ్రాలు అరెస్ట్ అయితే ముందుగా వారికి జిల్లా వైద్యాధికారులతో పరీక్షలు చేయించాలని తెలిపింది.

ఈ వైద్యపరీక్షలలో వచ్చిన రిపోర్టు ప్రకారం వారిలో మగ లక్షణాలు ఎక్కువగా ఉంటే పురుషుల జైలుల్లో, ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటే మహిళల జైలులో నిర్బంధించవచ్చని హైకోర్టు తెలిపింది. ఇప్పటివరకూ ఇలాంటి సంఘటలను ఎప్పుడూ జరగలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక వేల అలాంటి పరిస్థితి ఎదురైతే హైకోర్టు ఉత్తర్వులను పాటించాలని తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories