అరుదైన ఘనత సాధించిన మాధురి కనిత్కర్.. లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదా పొందిన మూడవ మహిళగా గుర్తింపు

అరుదైన ఘనత సాధించిన మాధురి కనిత్కర్.. లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదా పొందిన మూడవ మహిళగా గుర్తింపు
x
అరుదైన ఘనత సాధించిన మాధురి కనిత్కర్
Highlights

మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందారు. భారత సైన్యంలో ఈ పదోన్నతి పొందిన మూడవ మహిళగా...

మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతలో భాగంగా లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందారు. భారత సైన్యంలో ఈ పదోన్నతి పొందిన మూడవ మహిళగా గుర్తింపు పొందారు. మాధురి కనిత్కర్ భారత మిలటరీలో గత 37 సంవత్సరాలు పనిచేశారు. సర్జన్ వైస్ అడ్మిరల్, భారత నావికాదళం, సైన్యంలో మాజీ 3-స్టార్ ఫ్లాగ్ ఆఫీసర్ గా మాధురి కనిత్కర్ పని చేశారు.

దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు ఇండియన్‌ ఆర్మీలో పనిచేసిన మేజర్‌ జనరల్‌ మాధురి కనిత్కర్‌ అరుదైన ఘనత సాధించారు. పదోన్నతిలో భాగంగా సైన్యంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదా పొందారు ఈ హోదా పొందిన మూడవ మహిళగా గుర్తింపు పొందారు. అదే సమయంలో ఆర్మీలో రెండవ అత్యున్నత పదవిని సాధించిన మొదటి మహిళా పీడియాట్రిషియన్‌గా ఘనత సాధించారు. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద నియమించబడ్డారు. త్రివిధ దళాల కోసం మొత్తం రక్షణ సముపార్జన ప్రణాళికను రూపొందిస్తూ, ఆయుధాలు, సామగ్రిని స్వదేశీకరించడానికి వీలైనంత వరకు సులభతరం చేయడం CDS ప్రధాన ఉద్దేశం.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కింద నియమించబడ్డ మేజర్ జనరల్ మాధురి కనిత్కర్ పలు కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. కేటాయించిన బడ్జెట్ వాంఛనీయ వినియోగాన్ని నిర్ధారించడంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి ప్రణాళిక, సమైక్యత ద్వారా సేవల సేకరణ, శిక్షణ కార్యకలాపాలలో మరింత సినర్జీని తీసుకుంటుంది. మేజర్ జనరల్ మాధురి కనిత్కర్, లెఫ్టినెంట్ జనరల్ అయిన ఆమె భర్త రాజీవ్ సాయుధ దళాలలో ర్యాంకు సాధించిన మొదటి జంటగా గుర్తింపు పొందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories