అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా ఓం బిర్లాకు పేరు

అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా ఓం బిర్లాకు పేరు
x
Highlights

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా ఓం బిర్లా పేరును ప్రధాని మోడీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్...

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా ఓం బిర్లా పేరును ప్రధాని మోడీ ప్రతిపాదించగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ బలపరిచారు. ప్రతిపక్షాల నుంచి స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఓం బిర్లా ఎన్నిక ఏకగ్రీవమైంది. 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ పేరు ప్రతిపాదించగా అన్ని పక్షాలు పూర్తిస్థాయి మద్దతు తెలిపాయి. అనంతరం ఆయనను స్పీకర్ స్థానానికి ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి స్పీకర్ చైర్ వరకు తీసుకొని వెళ్లారు.

బీజేపీ చీఫ్ అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా ఓం బిర్లాకు పేరుంది. ఓం బిర్లా 1962 నవంబరు 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. ఓం బిర్లా అజ్మీర్‌లోని మహర్షి దయానంద్‌ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో మాస్టర్స్‌ చేశారు. బీజేవైఎంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1987-91లో కోటా జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా 1991-97లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా, 1997-2003లో బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓం బిర్లా ఆ విభాగంలో అనేక పదవులు నిర్వహించారు. ఓం బిర్లాకు సభా వ్యవహరాలపై పట్టు ఉండటం, పార్టీకి విధేయుడు కావడంతో బీజేపీ ఆయన్ని స్పీకర్ అభ్యర్ధిగా ప్రకటించిందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories