Top
logo

బ్రేకింగ్: పట్టాలు తప్పిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్.. 50 మందికి గాయాలు!

బ్రేకింగ్: పట్టాలు తప్పిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్.. 50 మందికి గాయాలు!ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్
Highlights

ఒడిశాలో కటక్‌లోని నిర్గుండి వద్ద ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రైల్‌లోని ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో...

ఒడిశాలో కటక్‌లోని నిర్గుండి వద్ద ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. రైల్‌లోని ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై నుంచి భువనేశ్వర్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పొగ మంచు కారణంగా ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్‌ వ్యాన్‌ను ఢీ కొట్టడంతో ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్ 6 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.


Web TitleLokmanya Tilak Express derail in Cuttack

లైవ్ టీవి


Share it
Top