ఇవాళ లాక్‌డౌన్ 4 మార్గదర్శకాలు విడుదల

ఇవాళ లాక్‌డౌన్ 4 మార్గదర్శకాలు విడుదల
x
Highlights

కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ...

కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ ఏకంగా 6 గంటల పాటు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అందరూ అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఇందుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి నిర్ణయం తీసుకుంటారు.

దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ 4 నిబంధనలను ఖరారు చేశారు. ఇవాళ ప్రధాని మోడీతో సమావేశం తర్వాత హోంశాఖ కార్యదర్శి లాక్‌డౌన్‌ 4 నిబంధనలను ప్రకటించనున్నారు. ఈ సారి వచ్చే లాక్‌డౌన్‌ 4 నిబంధనలు ఎవరూ ఊహించని విధంగా విభిన్నంగా ఉంటాయని గతంలో ప్రధాని చెప్పుకొచ్చారు. దీంతో లాక్‌డౌన్‌ 4 ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories