అంబులెన్స్‌కు దారి ఇచ్చిన లక్షలాది మంది భక్తులు.. వీడియో

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన లక్షలాది మంది భక్తులు.. వీడియో
x
Highlights

ఒడిశాలో జులై 4న పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ రోజున చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియోను పూరీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌...

ఒడిశాలో జులై 4న పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ రోజున చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియోను పూరీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. జగన్నాథుడు కొలువైన ఒడిశాలోని పూరి క్షేత్రంలో ఈ నెల 4న రథయాత్ర జరిగింది. ఆ రోజు దేశం నలుమూలల నుంచి లక్షల మంది వచ్చారు. సరిగ్గా రథయాత్ర సమయంలో ఓ అంబులెన్స్ వచ్చింది. అసలు రథయాత్ర అంటేనే జనసందోహం. అన్ని లక్షల మంది మధ్యలోంచి సైకిల్ కాదు, కదా అసలు మనిషి కూడా పక్కకు కదలాలంటేనే కష్టం. అలంటిది భక్తులు వెంటనే అప్రమత్తమై రోడ్డుకు అటూ ఇటూ తొలగిపోయి అంబులెన్సుకు దారి ఇచ్చారు. ఆ అంబులెన్సు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లడానికి అక్కడున్న వారు మానవహారాన్ని కట్టారు. భక్తులంతా ఆ అంబులెన్సు వెళ్లడానికి ఇచ్చిన సహకారానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ''పూరీ రథయాత్ర కోసం 1200 మంది వాలంటీర్లు, 10 స్వచ్ఛంద సంస్థలు గంటల కొద్దీ సాధన చేశారు. దీని ఫలితంగా ఈ మానవ కారిడార్‌ను ఏర్పాట్లు చేయగలిగి, అంబులెన్సు వెళ్లేందుకు దారి ఇవ్వగలిగారు'' అని పోలీసులు.. పూరీ ఎస్పీ ట్విటర్‌ ఖాతాలో పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories