పోలీస్ స్టేషన్‌లో టిక్‌టాక్ చేసింది..సస్పెండ్‌ అయింది

పోలీస్ స్టేషన్‌లో టిక్‌టాక్ చేసింది..సస్పెండ్‌ అయింది
x
Highlights

పోలీస్ స్టేషన్‌లో టిక్‌ టాక్‌ వీడియో చేసిన ఓ మహిళా పోలీస్ సస్పెండ్‌ అయింది. ఈ సంఘటన గుజరాత్‌ మేసానా జిల్లాలోని లంఘ్‌నాజ్‌ పోలీస్ స్టేషన్‌లో జులై 20వ...

పోలీస్ స్టేషన్‌లో టిక్‌ టాక్‌ వీడియో చేసిన ఓ మహిళా పోలీస్ సస్పెండ్‌ అయింది. ఈ సంఘటన గుజరాత్‌ మేసానా జిల్లాలోని లంఘ్‌నాజ్‌ పోలీస్ స్టేషన్‌లో జులై 20వ తేదీన చోటు చేసుకుంది. మేసానా జిల్లాలోని లంఘ్‌నాజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన అర్పితా చౌదరి అనే మహిళా పోలీసు పోలీస్‌ స్టేషన్లో టిక్‌టాక్‌ చేసింది. విధులను పక్కన పెట్టి బాలీవుడ్ పాటకు చిందులేసింది. ఆ వీడియో ఎలా ఉందో చెప్పాలంటూ దాన్ని వాట్సాప్‌లో అందరికీ షేర్‌ చేసింది. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి చివరికి గుజరాత్‌ పోలీస్‌ ఉన్నతాధికారుల కంట పడింది. దీంతో ఆమెను విధులను నుంచి సస్పెండ్‌ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories