కాస్కో కుమార

కాస్కో కుమార
x
Highlights

కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ నుంచీ 9 మంది, జేడీఎస్ నుంచీ 3 ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. తమ...

కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ నుంచీ 9 మంది, జేడీఎస్ నుంచీ 3 ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. తమ రాజీనామాలను స్పీకర్ ఆఫీస్‌లో ఇచ్చారు.

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కుమారస్వామి ప్రభుత్వానికి కఠిన పరీక్షలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా తాజాగా మరో 12 మంది రాజీనామాకు సిద్ధపడ్డారు. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు 9 మంది ఉండగా ముగ్గురు జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

కాంగ్సెస్ ఎమ్మెల్యేలు రమేష్ జర్కీహోలీ, బీసీ పాటిల్‌, మునిరత్న, ప్రసాద గౌడ పాటిల్‌, శివరామ హెబ్బర్, రామలింగా రెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్‌‌, బైరాతి బసవరాజ్‌లు తమ రాజీనామా బాట పట్టారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు నారాయణ గౌడ గోపాలయ్య, హెచ్.విశ్వనాథ్ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వారు స్పీకర్ కార్యాలయానికి చేరిన సమయానికి స్పీకర్ రమేష్ అందుబాటులో లేరు. దీంతో వారంతా స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి తమ రాజీనామా లేఖలను అందజేశారు.

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆ రాష అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. చట్ట ప్రకారమే తాము నడుచుకుంటామని తెలిపారు. మంగళవారం నాడు తాను కార్యాలయానికి చేరుకుంటానని..అప్పుడే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని స్పీకర్ తెలిపారు. తమ కార్యాలయానికి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారని వెల్లడించారు. ఆదివారం కార్యాలయానికి సెలవు దినం కావడం, సోమవారం తాను బెంగళూర్‌లో అందుబాటులో ఉండనిని స్పీకర్ వెల్లడించారు.

కర్ణాటకలో తాజా పరిణామాలపై డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు ఏం చేయాలనే విషయమై తర్జన భర్జనలు పడుతున్నారు. మరోవైపు ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి అందుబాటులోలేరు ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో ఆయన బెంగళూరు చేరుకోనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories