కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం

కుప్పకూలిన కుమారస్వామి ప్రభుత్వం
x
Highlights

కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. కుమారుస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం...

కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. కుమారుస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్‌ రమేష్‌ ప్రకటించారు. అధికార కూటమికి చెందిన 15మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వం కూలిపోయింది. సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. స్పీకర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది వరుసల వారీగా ఒక్కో సభ్యుడ్ని లెక్కించారు.

డివిజన్ పద్ధతిలో జరిగిన ఈ ఓటింగ్ లో కూటమి సర్కార్ కి మ్యాజిక్ ఫిగర్ 103 ని అందుకోకా కేవలం 99 ఓట్లుతో సరిపెట్టుకుంది . కర్ణాటకలో సంకీర్ణ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు మాత్రమే అవుతుంది . మే 23 న ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసారు . గతంలో కూడా కుమారస్వామి బీజేపితో సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడ్డప్పుడు 20 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories