మోదీతో ఉన్న ఈ బుడతడు ఎవరో తెలుసా ?!

మోదీతో  ఉన్న ఈ బుడతడు ఎవరో తెలుసా ?!
x
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోలు ఆయన అభిమానులతో పాటు మీడియా వర్గాల్లో కూడా కాసేపు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్‌లో...

ప్రధాని నరేంద్ర మోడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫోటోలు ఆయన అభిమానులతో పాటు మీడియా వర్గాల్లో కూడా కాసేపు చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్‌లో మోడీ ఓ చిన్నారితో ఆడుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ చాలా ప్రత్యేకమైన స్నేహితుడు ఒకరు ఈ రోజు పార్లమెంటులో నన్ను కలుసుకున్నారని క్యాప్షన్‌ ఇచ్చారు. పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలు లక్షల్లో లైక్‌లతో తెగ వైరల్‌ అయ్యాయి.

దాంతో పాటు మోదీ చేతుల్లో ఉన్న చిన్నారి ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ప్రయత్నం చేశారు. తొలుత మోదీని కలవడానికి వచ్చిన సందర్శకులకు సంబంధించిన వారి బిడ్డగా భావించారు. అయితే చివరకు ఆ బుడతడు బీజేపీ పార్లమెంట్‌ మెంబర్‌ సత్యనారాయణ జతియా మనవడిగా తెలీంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories