చట్టాలు కఠినతరం చేస్తాం: కిషన్ రెడ్డి

kishan reddy
x
kishan reddy
Highlights

ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రియాంకా రెడ్డి కుటుంబసభ్యులను ఈరోజు మధ్యాహ్నం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి

హైదరాబాదు శివారులో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకా రెడ్డి పై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపి, పెట్రోల్ పోసి తగలబెట్టిన విషయం సంగతి తెలిసిందే.. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కదిలిచింది. నిందితులను భాదితురాలు లాగే బహిరంగంగా పెట్రోల్ పోసి తగలబెట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులను షాద్ నగర్ నుండి చర్లపల్లి జైలుకి తరిలిస్తుండగా వారిని మాకు అప్పగించండి వారికి మేము న్యాయం చేస్తాం అంటూ పొలీస్ స్టేషన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు.

ఇది ఇలా ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రియాంకా రెడ్డి కుటుంబసభ్యులను ఈరోజు మధ్యాహ్నం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి జరిగిన అన్యాయం దారుణమని, నిందితులను పోలీసులు త్వరగా అరెస్ట్‌ చేశారన్నారు. ఇక రాష్ట ప్రభుత్వం కూడా నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని అన్నారు. ప్రియాంకా కుటుంబానికి ఎలాంటి సహాయం చేయడానికైనా ముందుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

అయితే ఇలాంటి కేసుల్లో తొందరగా న్యాయం జరిగేలా చూసేందుకు చట్టాల్లో మార్పులు తీసుకు రాబోతున్నామని చెప్పారు. చాలా కేసుల్లో ట్రయల్ కోర్టులు విధించిన తీర్పులను హైకోర్టులో సవాల్ చేస్తున్నారని.. ఇక నుంచి అలాంటి ప్రక్రియ లేకుండా ఏకంగా సుప్రీంకోర్టులోనే తేల్చుకునేలా చట్టాలను మారుస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఇక మహిళల రక్షణ కోసం ఢిల్లీలో ఓ యాప్ ని రెడీ చేశామనీ, దానిని అందరు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సింగిల్ డిజిట్ ప్రెస్ ద్వారా క్షణాల్లో సమీపంలోని పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్లేలా.. ఆ యాప్‌ను రూపొందించామన్నారు. దీనిని తెలంగాణా ప్రభుత్వానికి కూడా సూచిస్తామని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories