ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభంజనం.. కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం !

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభంజనం.. కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం !
x
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభంజనం.. కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం !
Highlights

దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గెలుపెవరిదో ఆల్రేడి తేలిపోయింది. కొన్ని స్థానాలు అటు ఇటు అయినా ఆమ్‌ ఆద్మీ...

దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గెలుపెవరిదో ఆల్రేడి తేలిపోయింది. కొన్ని స్థానాలు అటు ఇటు అయినా ఆమ్‌ ఆద్మీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. వరుసగా మూడోసారి కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించారు. అయినప్పటికీ విజయం కేజ్రీవాల్‌నే వరించింది.

ఈసారి ఢిల్లీలో 62.59 శాత‌మే ఓటింగ్ న‌మోదు అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లే ఆప్ చెల‌రేగిపోయింది. తాజా ఎన్నిక‌ల్లో ఆప్‌కు 52 శాతం, బీజేపీకి 47 శాతం ఓట్లు పోలైన‌ట్లు తెలుస్తోంది. మీ కుమారుడిని అనుకుంటేనే ఓటు వేయండి ఉగ్రవాది అనుకుంటే ఓటు వేయ‌కండి అంటూ కేజ్రీ ప్రచార చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం దిశగా దూసుకెళుతోన్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో టపాసులు పేల్చొద్దని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. వాటికి బదులుగా మిఠాయిలు పంచాలని చెప్పారు. దీంతో ఆయన ఆదేశాలను ఆప్ నేతలు కార్యకర్తలు పాటిస్తున్నారు. టపాసులకు బదులుగా బెలూన్లను గాల్లోకి వదిలిపెడుతూ, మిఠాయిలు పంచుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.

2015లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కేవలం మూడుస్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి అనూహ్యంగా పుంజుకుంది. 12 నుంచి 14 స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోనున్నట్లు ఫలితాల్లో తెలుస్తోంది. పెద్ద ఎత్తున అగ్రనేతలు ప్రచారం చేసినా అనుకున్న ఫలితాలు రాకపోవడంతో బీజేపీ అధిష్టానం ఢిల్లీ ఫలితాలపై చర్చించుకుంటుంది.

అయితే ఢిల్లీ ఓటర్లు ఈసారికి కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సుదీర్ఘ కాలం ఢిల్లీ పీఠం ఏలిన చరిత్ర కలిగిన హస్తం పార్టీని జీరో చేసేశారు. ఓ ఎన్నికల్లో అనుకూల, మరో ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలతో ఆ పార్టీని ఓటర్లు కంగుతినిపిస్తున్నారు. గత ఏడాది అక్టోబరు, నవంబరులో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గణనీయంగా ఆదరించి ఆశ రేకెత్తించిన ఓటర్లు, ఢిల్లీకి వచ్చేసరికి సున్నాకే పరిమితం చేసి తీవ్ర నిరాశలో ముంచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories