దారుణం : కరోనా వల్ల వీడియోకాల్‌ లోనే తండ్రి అంత్యక్రియలు చూసిన కొడుకు

దారుణం : కరోనా వల్ల వీడియోకాల్‌ లోనే తండ్రి అంత్యక్రియలు చూసిన కొడుకు
x
Coronavirus Suspect Watches Father's Funeral
Highlights

కరోనా ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్ .. ఈ కరోనా వైరస్ మొదట చైనా దేశంలో మొదలైనప్పటికీ మెల్లమెల్లగా ఇతర దేశాలకు వ్యాపిస్తుంది.

కరోనా ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న వైరస్ .. ఈ కరోనా వైరస్ మొదట చైనా దేశంలో మొదలైనప్పటికీ మెల్లమెల్లగా ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. దాదాపుగా సుమారు 145 దేశాలలో వ్యాపించింది. అయితే ఈ వైరస్ వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొద్ది మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తుండటంతో బాధితులను నిర్బంధంలో ఉంచుతున్నారు. అందులో భాగంగానే కేరళలో ఓ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది.

ప్రముఖ ఇంగ్లిష్ వెబ్సైట్ ఎన్డీటీవీ వెల్లడించిన కథనం ప్రకారం.. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తన తండ్రిని చూడడానికి ఖతార్‌ నుంచి అతని కుమారుడు లినో అబెల్‌(29) కేరళకి వచ్చాడు. కరోనా వైరస్ ప్రభావిత దేశాలలో ఒకటైన ఖతార్ నుండి మార్చి 8 న వచ్చాడు లినో అబెల్.. ఇక్కడ్స ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా, అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు వెల్లడించారు. దీనితో ఎవరికీ తెలియకుండా కొట్టయాంలోని తన తండ్రి ఉన్న ఆసుపత్రికి చేరుకొని అక్కడ వైద్యులను సంప్రదించాడు. అక్కడ మళ్ళీ పరీక్షలు నిర్వహించి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అతన్ని ఐసోలేషన్‌ వార్డుకు చేర్చారు.

ఇది జరిగిన మర్నాడే (మార్చి 9న) అతని తండ్రి చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న అబెల్‌ తన తండ్రి మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి అంబులెన్సులో తరలిస్తున్న దృశ్యాన్ని కిటికీలో నుంచి చూసి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇది చూసి చలించిపోయిన వైద్యులు తన తండ్రి అంత్యక్రియలను వీడియో కాల్‌ ద్వారా చూపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories