మంచులో కేదరినాథ్‌ క్షేత్రం

మంచులో కేదరినాథ్‌ క్షేత్రం
x
Highlights

శైవ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం కేదరినాథ్. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు ఎంతో పుణ్యం కలుగుతుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఆ ప్రాంతానికి...

శైవ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రం కేదరినాథ్. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలు ఎంతో పుణ్యం కలుగుతుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఆ ప్రాంతానికి వెళ్లడం ఎంతో కష్టతమైనా కూడా అక్కడికి వెళతారు చాలా మంది భక్తులు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ వారి కష్టాన్ని కూడా వారు మరచిపోతారు.

కానీ ఈ ఆలయాన్ని 6 నెలలు మూసివేసి, మరో 6 నెలలు భక్తుల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. అయితే ప్రస్తుతం చలికాలం కావడంతో ప్రతిష్టాత్మకమైన ఈ శైవ క్షేత్రాన్ని మంచు దుప్పటి కప్పుకుంది. అంతే కాక గుడి పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటాయి.

ఈ సమయంలో భక్తులు రాక పోకలకు అసౌకర్యం కలగుతుందనే ఉద్దేశంతోనే ఈ ఆలయాన్ని 6 నెలల కాలం పాటు మూసేస్తారని ఆలయకమిటీ తెలిపింది. దీంతో పాటుగానే కేదారినాథ్‌తో పాటు, అమర్‌నాథ్‌ సహా చార్‌ధామ్‌ ఆలయాలను శీతాకాల సమయంలో మూసేస్తారు. మళ్లీ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్న భక్తులు ఆరు నెలల కాలం పాటు ఆగాల్సిందే.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories